loader

KTR పేరే డ్రామారావు- రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షను కేటీఆర్ డ్రామాగా అభివర్ణించడాన్ని ఆయన ఖండించారు. కేటీఆర్ పేరే డ్రామారావు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కుటుంబంలోనే నాటకాలు జరుగుతున్నాయని, ఒకరు బీసీలకు అనుకూలంగా, మరొకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

రక్తదానం చేస్తున్న అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. మెగాస్టార్ చిరంజీవి

79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు రక్తదానం చేస్తున్న దాతలు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రక్తదానం చేయడం అనేది ఎనలేని సంతృప్తిని ఇస్తుంది. దాని వలన ఒక ప్రాణం నిలబడుతుంది. నేను ఇది ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న గొప్ప ఫీలింగ్.

ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రాష్ట్రంలో కొత్త బార్‌ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే ఆగస్ట్ 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని వివరించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్తానం (టీటీడీ)కి చెందిన 25 ఎకరాల భూమిని వైష్ణవి ఇన్‌ఫ్రా కంపెనీకి ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం 40వేల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా […]

రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్ రెడ్డి

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతాం’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్‌లో చర్చించి వెంటనే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘మా డిమాండ్‌ను ఆమోదిస్తారా, లేక రాహుల్ గాంధీని ప్రధానిగా […]

అన్నంత పని చేసిన ట్రంప్..మరో 25% ట్యాక్స్

భారతదేశంపై అమెరికా మరో ఆర్థిక ఎదురుదెబ్బ వేసింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికే ఉన్న 25% సుంకానికి తోడు, తాజాగా అదనంగా మరో 25% సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ద్వారా భారత్‌పై మొత్తంగా 50% దిగుమతి సుంకం అమలులోకి రానుంది. భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని, అదే కారణంగా, భారత్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ […]

మృతదేహాలను ఖననం చేసిన వారిలో మరో ఆరుగురు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల పుణ్య క్షేత్రంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మహిళలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలో పారిశుద్ధ్య కార్మికుడు మాత్రమే కాదు.. మరో ఆరుగురు వ్యక్తులు మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు ముందుకు వచ్చారు. కొత్తగా వచ్చిన ఈ ఆరుగురు కూడా మృతదేహాలను ఖననం చేసిన ప్లేస్‌లో తవ్వకాలు చేపడితే ఆధారాలు దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా కంప్లైంట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు వీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై అధికారులు దర్యాప్తు […]

నేను చేసింది ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌ కాదు, గేమింగ్‌ యాప్‌

విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయ్‌ దేవరకొండ దీనిపై వివరణ ఇచ్చారు. అదే సమయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. తాను చేసింది ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కాదు అని, గేమింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని మీడియా గమనించాలని చెప్పింది. బెట్టింగ్‌ యాప్‌లు అక్రమమే కానీ, తాను చేసిన గేమింగ్‌ యాప్‌లు అని, అవి అధికారికంగా ప్రభుత్వం(చట్టబద్దంగా) చేత రిజిస్టర్‌ అయినవే అని అందులో ఇల్లీగల్‌ ఏం లేదని స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాల్లో సీఎం ఫోటో, పేరు వాడొచ్చు..సుప్రీంకోర్టు

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరును,  ఫోటోలను వాడకుండా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో పథకాల ప్రచారంలో తమ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేరు, ఫోటోలను యథావిధిగా ఉపయోగించుకోవడానికి డీఎంకే ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన ఏఐఏడీఎంకే నాయకుడు సి.వి.షణ్ముగంకు సుప్రీం కోర్టు పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.

తొలగించబడిన బీహార్ 65 లక్షల ఓటర్ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశిస్తూ, బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాలో నుండి తొలగించబడిన ఓటర్ల వివరాలను ఆగస్టు 9వ తేదీ వరకు సమర్పించాలంటూ ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో ప్రజల ప్రాథమిక హక్కులు నొక్కి చెబుతూ, రాజకీయ పార్టీలు ఇప్పటికే డేటా పొందినందున, అదే సమాచారం ఎన్జీఓకు ఇవ్వాలంటూ సూచించింది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తొలగించబడిన ఓటర్లు వలస వెళ్లారా, చనిపోయారా అనే విషయాల్లో […]

మరో హామీ అమలు.. వారందరికీ ఇళ్లపట్టాలు..

కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు అశోక్‌నగర్‌లోని గూడెం కొట్టాల వాసులకు నారా లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు. 40 ఏళ్ల నుంచి పూరిగుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2025 జనవరిలో టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.30 ద్వారా ఎకరా స్థలాన్ని 150 మంది పేదలకు ఇళ్లపట్టాల కింద పంపిణీ చేశారు. మంత్రి టీజీ భరత్‌ చేతుల మీదుగా బుధవారం శాశ్వత […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON