loader

స్టుపిడ్ పొలిటీషియన్స్..రేణూ దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు

‘స్టుపిడ్ పొలిటీషియన్స్’ అంటూ రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్‌ లో మైనింగ్ చేయాలని కొంత మంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నాట. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒకప్పుడు ఒకప్పుడు 3 పులులు మాత్రమే ఉండేవట. ఇప్పుడు వాటి సంఖ్య 50కు పైగా చేరిందట. అలాంటి చోట మైనింగ్ ను చేపట్టి మూగ జీవాలను ఎక్కడికి తరిమేస్తారు? లేదా చంపేస్తారా? అంటూ […]

ఈవీఎంలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఈవీఎంల విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని.. వాటిని రద్దు చేసి.. తిరిగి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అయితే తమ పార్టీ గుర్తు అయిన కారుతో పోలి ఉన్న గుర్తులను.. ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని గత కొన్నేళ్లుగా తాము తీవ్ర పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలను పారదర్శక పద్ధతిలో నిర్వహించాలని సూచించారు.

స్పైస్ జెట్ ఉద్యోగుల దాడి కేసులో ట్విస్ట్?… తొలుత ఆర్మీ అధికారిపైనే సిబ్బంది దాడి

స్పైస్‌జెట్ ఉద్యోగిపై దాడి కేసులో ట్విస్ట్ ఇది. శ్రీనగర్ నుండి ఢిల్లీకి వెళ్లే SG-359 విమానం బోర్డింగ్ గేట్ వద్ద నలుగురు స్పైస్‌జెట్ ఉద్యోగులపై సీనియర్ ఆర్మీ అధికారి తీవ్రంగా దాడి చేసిన వీడియో వైరల్ అయిన ఒక రోజు తర్వాత, ఈ సంఘటనకు సంబంధించిన మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. తాజాగా వైరల్‌ అవుతోన్న వీడియోలో ఎయిర్‌లైన్ సిబ్బంది మొదట లెఫ్టినెంట్ కల్నల్‌ను కొట్టినట్లు ఆ తర్వాత ఆర్మీ అధికారి ప్రతీకారం తీర్చుకున్నట్లు చూడవచ్చు.

కలియుగం ఎలా ఉంటుందో కనిపిస్తోంది.. చంద్రబాబు పాలనపై వైఎస్‌ జగన్‌ సెటైర్లు

ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే కలియుగం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా బురదవేసి కడుక్కోమంటున్నారని విమర్శించారు  వైసీపీ లీగల్ సెల్‌ ప్రతినిధులతో మంగళవారం నాడు వైఎస్‌ జగన్‌ను సమావేశమయ్యారు.  అక్రమ కేసులు ఎదుర్కొంటున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లాయర్లు అందించిన సేవను ఎప్పటికీ మరిచిపోమని […]

ఆక్రోశం వెళ్లగక్కిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

పదవి కోసం ఎవరినీ అడగను అని.. తాను ఎవరికాళ్లు మొక్కి పదవి తీసుకోదలచుకోలేదని, తనకు పదవులు అవసరం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెగేసి చెప్పేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే నాకిప్పటికే మంత్రి పదవి వచ్చేది.. కానీ మునుగోడు ప్రజల కోసం నేను ఆ అవకాశాన్ని వదిలేశాను అంటూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకూ, తనకంటూ జూనియర్లకూ పదవులు ఇచ్చారని నేను మాత్రం ఆ పదవుల కోసం ఎవరికాళ్లూ మొక్కను అంటూ […]

జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ టాప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బలంగా పుంజుకుంటోందని.. ఏపీ బలమైన ఆర్థిక పునరుద్ధరణకు జులై నెల జీఎస్టీ వసూళ్లే కారణమంటున్నారు. 2017లో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం. అలాగే ఏపీ వార్షిక వృద్ధి కూడా.. 14 శాతంగా ఉంది. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. గతంలో ఏ జులైలోనూ లేనంత జీఎస్టీ వసూళ్లను ఏపీ గత నెలలో సాధించింది. అలాగే 2018 నుంచి 2025 వరకూ.. జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రావటం […]

రూ.500 నోట్లు ఆపేయాలన్న ప్రతిపాదనేదీ లేదు : కేంద్రం

ఇటీవలి రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక వదంతి హల్‌చల్ చేస్తోంది. రూ.500 నోట్ల సరఫరా ఆపేస్తున్నారు అంటూ మేసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ నోట్లను మార్చుకోవాలని సూచిస్తూ వాట్సాప్ ఫార్వార్డులు తిరుగుతున్నాయి. కానీ ఇవన్నీ అవాస్తవాలు!ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. “రూ.500 నోట్లను నిలిపివేస్తున్నట్టు ఎలాంటి నిర్ణయం లేదు” అని తేల్చిచెప్పింది. ఏటీఎంలలో ఈ నోట్ల జారీ యథాతథంగా కొనసాగుతుందని, పౌరులు ఆందోళన చెందాల్సిన పని లేదని వెల్లడించింది.

ప్ర‌శ్న‌లు వేయ‌డం, ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డం ప్ర‌తిప‌క్ష నేత విధి

“నిజమైన భారతీయుడెవరో తేల్చేది జడ్జీలు కాదు, అది ప్రజల హక్కు” అని అన్నారు. సుప్రీంకోర్టు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె ఈ మాటలు చెప్పారు ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఆమె బదులిస్తూ రాహుల్‌ను స‌మ‌ర్ధించారు. ప్ర‌శ్న‌లు వేయ‌డం, ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డం ప్ర‌తిప‌క్ష నేత విధి అని న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల పూర్తి గౌర‌వం ఉంద‌ని, కానీ నిజ‌మైన భార‌తీయుడిని తేల్చేది జ‌డ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు.

భర్తలు విసుక్కుంటే పడొద్దు.. ఫ్రీ బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్లిపోండి: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఓ సభలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. మహిళలు ఇపుడు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కలిగిందని “భర్తలు విసుక్కుంటే.. కసురుకుంటే ఎవరూ పడొద్దు.. హ్యాపీగా బస్సు ఎక్కి ఫ్రీ గా పుట్టింటికి వెళ్లిపోండి.. వాళ్లే చార్జీలు పెట్టుకొని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని ఏంఎల్ఏ అనటంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆర్టీసి బస్సులను భార్యా, భర్తలు విడిపోవటానికి ఉపయోగిస్తారా అంటూ విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

క్లౌడ్ బరస్ట్‌.. గ్రామాన్ని ముంచేసిన వరద.. 60 మంది గల్లంతు

ఉత్తరాఖండ్ ఉత్తర్‌కాశీ జిల్లా థరాలీ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.. క్లౌడ్ బరస్ట్‌తో మెరుపు వరదలు గ్రామాన్ని ముంచేత్తాయి.. ఖీర్ గంగా నది భారీ ఎత్తున ఉప్పొంగింది.. దీంతో చాలా మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.. పదుల సంఖ్యలో గృహాలు వరద బురద మేట కింద కూరుకుపోయారు. చాలా మంది గల్లంతయ్యాయరని.. శిధిలాల్లో మరికొందరు చిక్కుకున్నారని.. అధికారులు పేర్కొంటున్నారు. వెంటనే ఘటనాస్థలానికి సహాయ బృందాలను తరలించారు. ఇప్పటి వరకు 60 మందికిపైగా గల్లంతు అయ్యారని..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON