loader

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంకు వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం కు.. చిరంజీవి ప్రత్యేకంగా బొకె ఇచ్చి విష్ చేశారు. సీఎం రేవంత్ కూడా.. చిరంజీవిని అంతే ఆప్యాయతతో పలకరించి.. బొకెతో పాటు, శాలువతో చిరును సన్మానించారు. ఇద్దరు కూడా చాలా సేపు పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తొంది. చిరంజీవి మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమై మాట్లాడారంటూ.. తెలంగాణ సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫారమ్‌లో […]

హసీనా లేకుండానే.. అమానుషకాండపై విచారణ షురూ

ఆమె హాజరీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో విచారణ ఆరంభించారు. హసీనా ఇతరులపై అమానుషకాండ కేసు దాఖలు అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసిటి) ఈ ప్రక్రియను హసీనా హాజరీతో నిమిత్తం లేకుండా చేపట్టింది. ఆమె తమ పదవీకాలంలో విద్యార్థుల నిరసనలపై దమననీతితో వ్యవహరించారని, అమానుష నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు వెలువడ్డాయి. ఆమెకు పలుసార్లు సమన్లు ఆమె పేరిట పంపించారు.

అమెరికాలో అదృశ్యం కథ విషాదాంతం.. నలుగురు మృతి

అమెరికాలో అదృశ్యమైన భారత సంతతీకి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు మృతి చెందారు. పశ్చిమ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లున్న వాళ్ల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. జూలై 29న వీరి వాహనం అదృశ్యం అయింది. పెన్సిల్వేనియాలోని బర్గర్‌కింగ్ రెస్టారెంట్‌లో వీరి వాహనం చివరిసారిగా కనిపించింది. అక్కడే వాళ్లు చివరిసారిగా క్రెడిట్ కార్డును ఉపయోగించినట్లు తెలిసింది. వీరి ఆచూకీ కోసం పోలీసులు హెలికాఫ్టర్లు కూడా ఉపయోగించారు. కాగా.. ఆగస్టు 2 రాత్రి వాహనాన్ని పోలీసులు గుర్తించారు.

ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలి: కెటిఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ  20 నెలల అసమర్థ, అరాచక, అవినీతి పాలనకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని అన్నీ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రానున్న ఉపఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు. రాహుల్ గాంధీ,  మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్ర నేతలు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను డిక్లరేషన్ల […]

ఏఐపై మాజీ సీఎస్‌ ఎల్వీ చేసిన వ్యాఖ్యలు సరికాదు : టీటీడీ చైర్మన్‌

ఏఐ సాయంతో గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం అసంభవమని వ్యాఖ్యనించిన మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీకిస్వస్తి పలకమని చెప్పడాన్ని ఖండిస్తు న్నట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా మాట్లాడడం బాధాకరమని అన్నారు. టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని వృథా అనడం సరికాదన్నారు. భక్తులు షెడ్లు, కంపార్ట్‌మెంట్లలో పడిగాపులు కాయడం మంచిదా అంటూ ప్రశ్నించారు.

రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, రేపటి నుంచి షూటింగ్స్‌ బంద్‌కి పిలుపునిచ్చింది. ఆగస్టు 4 నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌కి 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఫెడరేషన్, 30 శాతం పెంచి వేతనాలు ఇస్తామని నిర్మాత నుంచి రాతపూర్వకంగా ధృవకరణ లేఖ ఇచ్చిన వారి సినిమాలకు మాత్రమే పనిచేయబోతున్నట్టుగా ప్రకటించింది.. 30 శాతం వేతనాలు పెంచడమే కాకుండా పెంచిన వేతనాలను ఏ రోజుకి ఆ రోజు చెల్లించేలా ఒప్పందం కూడా […]

మూడు జిల్లాల్లో ఐఏఎస్ అధికారులకు విద్యా శాఖ బాధ్యతలు అప్పగింపు

రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటిసారిగా మూడు జిల్లాల్లో విద్యా శాఖ బాధ్యతలను ఐఏఎస్ అధికారులకు అప్పజెప్పింది. తొలిసారిగా ఇలా ఐఏఎస్ అధికారులకు విద్యాశాఖ అధికారులుగా అదనపు బాధ్యతలను అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా జిల్లాలోని ఖుష్బూగుప్తాకు బాధ్యతలను అప్పగించారు. అటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా కుమార్ దీపక్‌కు అప్పగించారు. అలాగే జనగామ జిల్లా విద్యా శాఖ అధికారిగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పింది.

భువనగిరిలో లారీ బీభత్సం.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో లారీ బీభత్సవ సృష్టించింది. పట్టణంలోని జగదేవ్‌పూర్‌ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి దుకాణాల మీదికి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మూడు బైకులు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దవాఖానకు తరలించారు. మృతుల్లో ఒకరిని రాజపేట మండలం కురారం గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది.

కొడాలి నానిపై మరో కేసు నమోదు..

వైసీపీకి కీలక నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని పై తాజాగా ఏపీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. కేసుకు సంబంధించిన 41 సీఆర్‌పీసీ నోటీసులను గుడివాడలోని కొడాని నాని ఇంటికి వెళ్లి ఆదివారం అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని కించపరిచేలా నాని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని 2024లో విశాఖ వాసి అంజనాప్రియ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆదారంగా చేసుకుని విశాఖ మూడో టౌన్‌ పోలీసులు 353(2), 352, 351(4) సెక్షన్ల […]

నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న కవిత.. ధర్నాకి అనుమతి ఇవ్వని ప్రభుత్వం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు 4 నుంచి 7 వరకూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్ దగ్గర.. 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కవిత ఈ దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON