ఏకంగా 12సార్లు శ్రీశైలం హుండీ సొమ్ము కాజేసిన ఉద్యోగి..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో పరిచారకుడిగా విధులు నిర్వహిస్తున్న విద్యాధర్ గత 18 నెలల నుండి డ్యూటీ సమయం కంటే అరగంట ముందే హారతికి సంబంధించిన పనులు చూడాలంటూ గర్భాలయంలోకి వెళ్లేవాడని ఆ సమయంలో క్లాత్ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను దొంగలించేవాడని సుమారు 12 సార్లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు. దొంగలించిన రూ.1,24,200 నగదుతో పాటు కొనుగోలు చేసిన బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు.