loader

టీసీఎస్‌కు భూమి కేటాయింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు భూమిని కేటాయించిన పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ, “ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఈ సమయంలో నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తే తప్పేంటీ?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాల్ని చూడాలని సూచించారు. “ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వదని” న్యాయమూర్తి స్పష్టం చేశారు. తదుపరి విచారణ వాయిదా వేస్తూ, పారిశ్రామిక అభివృద్ధికి […]

రేపు జగన్ పర్యటన పై సోమిరెడ్డి స్పందన

వైసీపీ అధినేత జగన్ రేపు నెల్లూరు పర్యటన కు వస్తుండటంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రేపు జగన్ పర్యటన పై సోమిరెడ్డి స్పందన తీవ్రంగా స్పందించారు. జగన్ ఏ ముఖంతో నెల్లూరు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.జగన్ మాట విని అనేక మంది అధికారులు సమస్యలు ఎదుర్కొన్నారని సోమిరెడ్డి తెలిపారు. వారి సమస్యలను పట్టించుకోకుండా కాకాణిని పరామర్శించడానికి రావడం సరికాదన్నారు. లిక్కర్ స్కాంలో జైలుకెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డిలను కూడా జగన్ […]

మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి.. తెలంగాణ నుంచి ఏపీ మహిళ!

అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో HPCL డీలర్‌గా ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ రెండు నెలలపాటు జరిగింది. 18 మంది గ్రాండ్ ఫినాలేలో పోటీ పడగా నాలుగు రౌండ్లలో ప్రతిభను కనబరిచి మిస్సెస్ ఇండియాగా విజయలక్షి కిరీటాన్ని […]

సింగపూర్ పర్యటన ముగించుకుని ఏపీకి తిరుగు ప్రయాణం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించడమే కాకుండా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ పర్యటన జరిగింది. మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు సీఎం వివిధ సమావేశాలు, రౌండ్‌టేబుల్ చర్చల్లో పాల్గొని పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. సీఎం సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్‌తో […]

భారత్‌పై అక్కసు.. 25శాతం టారీఫ్‌, పెనాల్టీ విధించిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్‌పై 25శాతం టారిఫ్‌ ప్రకటించారు. తాము వారించినా వినకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై టారీఫ్‌తో పాటు అదనపు పెనాల్టీ కూడా విధించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ దిగుమతి చేసుకొనే వస్తువులపై కొత్త టారీఫ్‌, పెనాల్టీ నిబంధనలు వర్తిస్తాయని ట్రంప్ వెల్లడించారు.

అదుపు తప్పి సింధు నదిలో పడిన బస్సు

జమ్ము కశ్మీర్ లోని గండేర్‌బల్ జిల్లాలో కుల్లాన్ వద్ద బుధవారం ఇండో టిబెటన్ బార్డర్ కు చెందిన బస్సు అదుపు తప్పి సింధు నదిలో పడిపోయింది. ఐటీబిపి కి చెందిన జవాన్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ఐటిబిపి అధికారులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని అధికారులు చెప్పారు. అయితే బస్సులో ఎందరు ఉన్నారో తెలియలేదు. గాయపడిన డ్రైవర్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు.

విజయవంతంగా నింగిలోకి నిసార్ ఉపగ్రహం..

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ( NASA ), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం సాయంత్రం నింగిలోకి పంపారు. 26.30 గంటల కౌంటర్ డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ ఎఫ్ 16 రాకెట్ బుధవారం సాయంత్రం 5.40 గంటలకు నాసా- ఇస్రో సింథటిక్ అపార్చర్ ‌ను మోసుకెళ్లింది. ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ బయలుదేరిన 18 నిమిషాల తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి […]

కశ్మీర్‌లో భారీ వర్షాలు.. పహల్గాం, బల్తాల్ రూట్లలో అమర్‌నాథ్ యాత్ర రద్దు

కశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే పహల్గాం, బల్తాల్ రూట్లను బుధవారం అధికారులు రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్ము నుంచి యాత్రకు వెళ్లే మార్గాన్ని కూడా గురువారం రద్దు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున బల్తాల్, నున్వాన్-చందన్‌వారి స్థావర శిబిరాల నుంచి యాత్రను రద్దు చేయడమైందని

ఉచిత గ్యాస్ సిలిండర్ కీలక అప్‌డేట్.. ఇంకా 1 రోజు మాత్రమే.. లేదంటే నో బుకింగ్

దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదా? మీకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం ఇచ్చినా టైం ముగుస్తుంది. ఎందుకంటే రెండో విడత సిలిండర్ బుకింగ్ గడువు జూలై 31తో ముగియనుంది. ఇంకా బుక్ చేసుకోని వారు తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. గడువు దాటి బుకింగ్ చేసుకోవడం సాధ్యపడదు. మూడో విడత బుకింగ్ ప్రారంభం కానుంది. లబ్ధిదారులు ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వ తేదీ వరకు తమ ఉచిత […]

ఏపీలో అపారవనరులున్నాయి…పెట్టుబడులతో రండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని…వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులను కోరారు. సింగపూర్ పర్యటన చివరి రోజున పలు కంపెనీలకు చెందిన ప్రముఖులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నైల మధ్య ఎయిర్ పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON