loader

కాలుష్య‌కార‌క ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఓఆర్ఆర్ బ‌య‌ట‌కు త‌ర‌లించండి…సీఎం రేవంత్ రెడ్డి

కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ సిటీ ఏరియాలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని ఆదేశించారు. పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌పై ముఖ్య‌మంత్రి క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య‌ ర‌హితంగా మార్చడంతో పాటు 25 ఏళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

అమరావతిలో వేల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్! వైసీపీ సంచలన ఆరోపణలు

అమరావతిలో భూమి ప్రజలదని, అభివృద్ధి ఖర్చులు కూడా ప్రజలవేనని, కానీ ఆదాయం మాత్రం చంద్రబాబుది, చంద్రబాబు బీనామీలదేనంటూ విమర్శలు చేసింది వైఎస్‌ఆర్‌సీపీ. ట్రూత్‌ బాంబు పేరుతో కీలక డాక్యమెంట్స్‌ను బయటపెట్టింది. చంద్రబాబు అసలు అవినీతి కథ అంటూ సుదీర్ఘమైన ట్వీట్ చేసింది. అమరావతిలో ఫ్రీ అన్న మాటే పచ్చి అబద్ధమని పేర్కొంది. ఫ్రీ అయితే స్టార్టప్ ఏరియా ఒప్పందంలో 42 శాతం డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాల్సి వచ్చిందని ప్రశ్నించింది.

పాకిస్థాన్ వేడుకుంటేనే ఆపరేషన్ సిందూర్ ఆపేశాం : ప్రధాని మోదీ

లోక్‌సభలో జరిగిన మూడు రోజుల ప్రత్యేక చర్చలో పాల్గొన్న మోదీ, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పెద్ద స్థాయిలో స్పందిస్తుందన్న విషయం పాకిస్తాన్ సైన్యానికి అర్థమైందని ప్రధాని అన్నారు. అందుకే వారు అణ్వాయుధ భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ మోదీ ఆరోపించారు. మే 10న భారత దాడుల తర్వాత పాకిస్తాన్ తాము శాంతి కోరుతున్నామంటూ విన్నవించుకుందని ప్రధాని వెల్లడించారు. “పాకిస్తాన్ అప్పుడు ఇలా అన్నది – ‘చాలా కొట్టారు… ఇక మేము తట్టుకోలేం. యుద్ధం ఆపండి’ అని మనతో […]

అమెరికాలో కలకలం.. కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి భారత సంతతి పైలట్‌ అరెస్ట్

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో భారత సంతతికి చెందిన పైలట్‌ను అరెస్ట్ చేశారు. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కో-పైలట్ రుస్తమ్ భగ్వాగర్ (34)ను చిన్నారిపై లైంగిక దాడి కేసులో అరెస్ట్ చేశారు. విమానం ల్యాండ్ అయిన 10 నిమిషాల్లోనే 10 మంది హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు విమానంలోకి ప్రవేశించారు. తుపాకులు, బ్యాడ్జీలు ధరించి కాక్‌పిట్‌లోకి ప్రవేశించి రుస్తమ్‌కు హ్యాండ్‌ కఫ్ వేసి బయటకు తీసుకెళ్లారు. ప్రయాణికులు ఇంకా దిగకముందే ఘటన చోటుచేసుకుంది.

ఈసారి కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యం: వైఎస్ జగన్

ఈసారి కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. ‘కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్‌ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలి. కాబట్టి గ్రామ కమిటీలే ఏర్పాటు కాగానే బూత్‌ లెవెల్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. మన పార్టీ మరో 30, 40 ఏళ్లపాటు కొనసాగాలంటే కార్యకర్తలు చాలా ముఖ్యం.’అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు.

ఉగ్రమూకలకు నిద్రలేని రాత్రులు మిగిల్చాం.. ప్రధాని మోదీ

పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి కేవలం 22 నిమిషాల్లోనే సమాధానం చెప్పామని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనమని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. గతంలో దాడులు చేసి ఉగ్రవాదులు హాయిగా నిద్రపోయేవారని.. కానీ ఇప్పుడు దాడులు చేయాలంటేనే వణుకుతున్నారని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన దేశానికి చుక్కలు చూపించామన్న మోదీ.. మరోసారి పాక్ దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

సింగపూర్ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు

ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. విశాఖపట్నం ఈ రంగానికి అత్యుత్తమ ప్రదేశమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 20కిపైగా పారిశ్రామిక, పెట్టుబడి అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఈ అవకాశాలను వివరించారు. 2026 జనవరి నాటికి అమరావతిలో తొలి క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెప్పారు.

18 ఏండ్ల త‌ర్వాత‌.. జులై నెల‌లోనే నాగార్జున సాగ‌ర్ 26 క్ర‌స్ట్ గేట్లు ఎత్తివేత‌

నాగార్జున సాగ‌ర్ నిండు కుండ‌లా మార‌డంతో.. ఆ ప్రాజెక్టు 26 క్ర‌స్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. అయితే జులై నెల‌లోనే 26 క్ర‌స్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేయ‌డం 18 ఏండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. ఇక సాగ‌ర్ గేట్లు ఎత్త‌డంతో.. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, ప‌ర్యాట‌కులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఉద‌యం రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొద‌ట 14 గేట్ల‌ను తెరిచారు. […]

భక్తులతో మర్యాదగా నడుచుకోండి.. శ్రీశైలం జీపు, ఆటో డ్రైవర్లకు సీఐ కీలక సూచనలు

శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని సీఐ ప్రసాదరావు సూచించారు. యాత్రికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదన్నారు. శ్రీశైలంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని జీప్‌ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, యజమానులు సీఐ జి.ప్రసాదరావు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. డ్రైవర్ల దగ్గర వాహనాల RC, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, కాలుష్య ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం

హిమాచల్ ప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమయ్యింది. లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. రోడ్లన్ని జలమయమైపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి మండి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు వదలమైపోయాయి. వర్షాలకు వాహనాలు నీటిలో మునిగిపోయిన దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి, సోషల్ మీడియా లో పోస్టు చేసారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON