loader

అజేయ శతకాలతో ఆదుకున్న జడ్డూ, వాషీ.. డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు

అనూహ్య మలుపులు తిరిగిన మాంచెస్టర్ టెస్టు డ్రాగా ముగిసింది. భారత మిడిలార్డర్ వీరోచిత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లు కుదేలవ్వగా.. టీమిండియా సిరీస్‌లో నిలిచింది. ఐదో రోజు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103) ఔటయ్యాక జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్న రవీంద్ర జడేజా(107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(101 నాటౌట్)లు చిరస్మరణీయ సెంచరీతో చెలరేగారు. ఐదో వికెట్‌కు అజేయంగా 203 రన్స్ జోడించిన ఈ ఇద్దరూ స్టోక్స్ సేన ఆశలపై నీళ్లు చల్లుతూ భారత జట్టును సిరీస్‌లో బరిలో […]

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఏం.. విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు

వారం రోజుల క్రితం తల తిరగడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోలుకున్నారు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి నుంచి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. అ తర్వాత ఆయన యాధావిధిగా తన బాధ్యతల్లో మునిగిపోవచ్చు’ అని డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ అనిల్ బీజీ మీడియాకు తెలిపారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబ్ కలకలం!

సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ బెదిరింపు కాల్, తమిళనాడులో కలవరం క్రియేట్ చేసింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ గుర్తు తెలియని వ్యక్తులు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. దీంతో మూడు  బాంబ్ స్క్యాడ్  , స్నిఫర్ డాగ్.. విజయ్ ఇంట్లో సునిశితంగా పరిశీలించి, తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో ఎలాంటి పేలుడు […]

డ్రగ్స్ కేసులో విల్ స్మిత్ కొడుకు జాడెన్ స్మిత్‌ అరెస్ట్?!

హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కొడుకు జాడెన్ స్మిత్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. తండ్రి విల్ స్మిత్‌తో కలిసి ‘ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’, జాకీ ఛాన్‌తో కలిసి ‘ది కరాటే కిడ్’ వంటి సినిమాల్లో నటించిన జాడెన్, ప్రస్తుతం పారిస్‌లో ఉన్న జాడెన్ స్మిత్, నగర వీధుల్లో వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. జాడెన్ స్మిత్ డ్రగ్స్ మత్తులో ఉండడం వల్లే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్నారు నెటిజన్లు.. మరికొందరైతే జాడెన్ స్మిత్, డ్రగ్స్‌తో పోలీసులకు […]

TCS కఠిన నిర్ణయం.. 12 వేల మంది ఉద్యోగాలు ఊస్టింగ్‌

సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది.ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు 12,200 ఉద్యోగాలను తొలగించనున్నట్లు తెలిపింది. “మా క్లయింట్లకు అందించేసేవలపై ఎటువంటి ప్రభావం ఉండకుండా చూసుకోవడానికి ఈ ప్రక్రియను తగిన జాగ్రత్తతో ప్లాన్ చేస్తున్నాం” అని కంపెనీ […]

బస్టాండ్ లో రెండేళ్ల బాలుడిని వదిలేసి… ప్రియుడితో పారిపోయిన తల్లి

ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాలు పంపించుకోవడంతో పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. బాలుడితో కలిసి హైదరాబాద్ నుంచి నల్లగొండకు చేరుకుంది. అనంతరం బాలుడిని అక్కడే వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. సిసి కెమెరాల ఆధారంగా బాలుడి తల్లి, ప్రియుడ్ని పట్టుకున్నారు. భార్య ఇచ్చిన సమాచారం మేరకు భర్తను పిఎస్‌కు పోలీసులు పిలిచారు. ఆమె ప్రియుడితోనే వెళ్లిపోతానని చెప్పడంతో బాలుడిని తండ్రికి అప్పగించారు.

సింగపూర్ లో తెలుగువారికి చంద్రబాబు పిలుపు

వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో సింగపూర్‌తో పాటు మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు హాజరయ్యారు. సింగపూర్‌లో 40 వేల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారని సీఎం తెలిపారు. వారు తమ కర్మభూమి అభివృద్ధికి సహకరించాలి కానీ, పుట్టిన గడ్డను మాత్రం మరవకూడదని అన్నారు.భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తిరిగి తెస్తాం: మంత్రి లోకేశ్

సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరైన లోకేశ్, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబట్టాలని ప్రవాస తెలుగువారికి పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగువారిని ప్రపంచపటంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుగారిదేనని, ఆయనే మన బ్రాండ్ అని లోకేశ్ పేర్కొన్నారు.

ఓ మంత్రి ఫోన్ మార్చేసి డబ్బా ఫోన్ వాడుతున్నాడు: జగదీష్ రెడ్డి

తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఓ మంత్రి వణికిపోతున్నాడని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మంత్రులు తన కుర్చీ లాక్కుంటారని సిఎం రేవంత్ కు భయం పట్టుకుందని అన్నారు. ఓ మంత్రి ఫోన్ మార్చేసి డబ్బా ఫోన్ వాడుతున్నాడని విమర్శించారు. బిజెపి వచ్చి బిఆర్ఎస్ లో విలీనం అవుతున్నా మాజీ సిఎం కెసిఆర్ ఒప్పుకోరని జగదీష్ రెడ్డి చెప్పారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చిన్న, పెద్ద బ్రోకర్లకు పదవులు ఇచ్చారని విమర్శించారు.

విశాఖపట్నంలో ఘనంగా కావడి యాత్ర

శ్రావణమాసం పురస్కరించుకుని విశాఖపట్నం నగరంలో ఆదివారం కావడి యాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో నగరంలోని మార్వాడీ సమాజం పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాలుపంచుకుంది. ప్రతి సంవత్సరం, శివుని అనుచరులు సావన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమయ్యే కన్వర్ యాత్ర అని పిలువబడే పవిత్ర యాత్రను నిర్వహిస్తారు. సావన్ మాసాన్ని ఎంతో భక్తితో పాటిస్తారు. సావన్ మాసంలో, భక్తులు శివుడిని పూజిస్తారు మరియు కన్వర్లను తీసుకువచ్చే వారిని కన్వర్యాలు అని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON