loader

కూకట్‌పల్లిలో దుకాణం.. డబ్బులిస్తే ఏ సర్టిఫికేట్స్ అయినా ఇస్తారు

ఓ నకిలీ సర్టిఫికెట్ ముఠా కుకట్‌పల్లిలో దుకాణం తెరిచింది. శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యకలాపాలకు తెరలేపారు. వీరు యువతీయువకుల డబ్బులు కాజేస్తూ నకిలీ సర్టిఫికేట్స్ అంజేస్తున్నారు. శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయం నిర్వహిస్తూ, విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల పట్టాలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇప్పటివరకు కనీసం 46 మందికి నకిలీ సర్టిఫేక్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 24 మంది ఇప్పటికే ఆ […]

భారతి సిమెంట్స్ కార్యాలయంలో సిట్ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, బాలాజి, గోవిందప్ప, చాణక్యలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాలాజి, గోవిందప్ప డైరెక్టర్లుగా పనిచేసిన భారతి సిమెంట్స్ కార్యాలయం, చాణక్యకు చెందిన గ్రిల్ రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయం కేంద్రంగా ఏపి మద్యం కుంభకోణం […]

కెటిఆర్.. 300 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచావో నాకు తెలుసు: సిఎం రమేష్

ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎంపి సిఎం రమేష్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తామని చెప్పలేదా? అంటూ కెటిఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కవితను రిలీజ్‌ చేస్తే బిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన మాట మరిచావా?. నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. 300 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచావు నాకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి.. సంస్కారం అడ్డువచ్చి చెప్పలేదు […]

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో నలుగురు హతం..!

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం నేపథ్యంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయని బస్తర్‌ రేంజ్‌ ఐడీ సుందర్‌రాజ్‌ పీ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

భారీ వర్షాలతో నిండుకుండలా హుస్సేన్ సాగర్

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు పెరగడంతో పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా… శనివారం ఉదయం వరకు నీటి మట్టం 513.41 మీటర్లకు చేరుకుంది. హుస్సేన్ సాగర్ నాలుగు తూము గేట్లు ఎత్తి దిగువకు నీటిని […]

టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో మోసం.. మరో వ్యక్తి వీర్యంతో గర్భధారణ

సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై శనివారం నార్త్ జోన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ మహిళ తన భర్త వీర్యకణాలతో సంతానం పొందాలని ఆశించి ఈ కేంద్రాన్ని ఆశ్రయించగా, వైద్యులు మరో వ్యక్తి వీర్యంతో గర్భధారణ జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దంపతులకెంతో నిరీక్షణ అనంతరం ఓ మగ బిడ్డ పుట్టాడు. కానీ కొన్ని నెలలకే బాబు అనారోగ్యంతో బాధపడుతూ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో వారు అనుమానించారు. డీఎన్‌ఏ పరీక్ష చేయించగా, పిల్లవాడికి తండ్రి డీఎన్‌ఏ […]

ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం.. 20 వాహనాలు ఢీ

వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై పెద్ద ప్రమాదం జరిగింది.20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సుమారు 16 మంది గాయపడ్డారు. హైవేలోని లోనావాలా-ఖండాల ఘాట్ వద్ద కంటైనర్ వాహనం బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. నియంత్రణ కోల్పోయిన ఆ కంటైనర్‌ ముందున్న ఒక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో మందున్న పలు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పలు కార్లతో సహా సుమారు 20 వాహనాలు దెబ్బతిన్నాయి.

ఈ ప్రభుత్వానికి మద్దతు బాధగా ఉంది…కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అయితే బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌పై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సంచలన కామెంట్స్ చేశారు. తాను భాగస్వామిగా ఉన్న ఎన్డీయే సర్కార్‌పైనే ఆయన విమర్శలు గుప్పించారు. పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో నితీష్ సర్కార్ విఫలమైందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు క్షమించండి అని అన్నారు.

గోవా సీఎంతో కమెడియన్ అలీ భేటీ

ప్రముఖ హాస్యనటుడు అలీ  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు అలీ గోవాలో ఉన్న విషయం తెలుసుకున్న సీఎం సావంత్ స్వయంగా అతడిని ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సీఎం అలీ సినీ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ మాట్లాడుతూ “1260 సినిమాల్లో నటించడం చాలా గొప్ప విషయం” అని కొనియాడారు. అలీ తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారని పేర్కొన్నారు. వారిద్దరి భేటీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

టిక్ టాక్‌కు ట్రంప్ బిగ్ షాక్..

టిక్ టాక్‌ ఇతర దేశాల్లో మాత్రం పనిచేస్తుంది. అమెరికాలో చాలా మంది దీన్ని వాడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్ భవిష్యత్తు చైనా చేతుల్లోనే ఉందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. టిక్‌టాక్ యొక్క యుఎస్ షేర్లను విక్రయించాలనే యుఎస్ ప్రతిపాదనను చైనా అంగీకరించకపోతే.. గతంలో మాదిరి టిక్‌టాక్‌ను మళ్ళీ యుఎస్‌లో నిషేధించనున్నట్లు లుట్నిక్ తెలిపారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సెప్టెంబర్ 17 వరకు టిక్‌టాక్‌కు గడువు ఇచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON