loader

మాల్దీవులకు భారత్ రుణసాయం

మాల్దీవులకు భారతదేశం రూ 4850 కోట్ల రుణం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవుల పర్యటనకు శుక్రవారం వచ్చారు. వెసులుబాట్లతో కూడిన రుణసాయాన్ని వెలువరించారు. మాల్దీవులకు భారతదేశం చిరకాల విశ్వసనీయ స్నేహపక్షంగా నిలబడటం భారత్‌కు గర్వకారణం అని ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తెలిపారు. ఇరుదేశాల మధ్య స్పల్ప కాలిక క్లిష్టత తరువాత ప్రధాని మోడీ ఇక్కడికి రావడం ఇరుదేశాల మధ్య వెనుకటి సానుకూలత దిశలో ముందడుగు అయింది.

శభాష్ కానిస్టేబుల్ హనుమంత‌రావు

చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి. గోతుల్లో నీరు చేరింది. రాత్రి వేళల్లో తెలియని వ్యక్తులు రోడ్డు అనుకుని ఆ గోతుల్లో పడే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ప్ర‌మాద తీవ్ర‌త‌ను ప‌సిగ‌ట్టిన కానిస్టేబుల్ హ‌నుమంత‌రావు ఆ ప్ర‌దేశం డేంజ‌ర్ అని తెలిపేలా వర్షంలో తడుస్తూ దగ్గరలో కిందపడి ఉన్న ఓ పార్టీకి చెందిన తోరణాన్ని స్నేహితులు మునవర్, ఈశ్వర్ సహాయంతో క‌ర్ర‌ల‌తో చుట్టూ క‌ట్టాడు. దీంతో […]

కుప్పంలో 250 పేద కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో #IAmMargadarsi పోస్టర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

మోదీలో దమ్ము లేదు- రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, మోదీపై నిశితంగా వ్యాఖ్యలు చేశారు. “నిజం చెప్పాలంటే మోదీకి ధైర్యం లేదు. ఆయనపై క్రియేట్ అయ్యే హైప్ అంతా మీడియా ద్వారా. అంతా ఒక షో మాత్రమే,” అని అన్నారు. “అయనను దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. మోదీ నిజమైన నాయకత్వ లక్షణాలు కలవాడు కాడు. ప్రజల్లో భయం కలిగించేలా ఆయనను మీడియా […]

శివాల‌యాల‌పై బాంబులు : కంబోడియా ర‌క్ష‌ణ‌శాఖ‌

థాయ్‌లాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు కంబోడియా సరిహద్దులోకి చొరబడి అక్కడ ఉన్న హిందూ ఆలయాలపై బాంబులు వేసినట్లు కంబోడియా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు సార్లు విమానాలు బాంబులు విసిరాయని స్పష్టం చేశారు. ఈ ఘటనను కంబోడియా రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ మాలీ సొచియాటా మీడియా ముందు వెల్లడించారు.

లంచం తీసుకుంటున్న అడ్డంగా దొరికిన సబ్ రిజిస్ట్రార్

అనంతపురంలోని కళ్యాణదుర్గం ఇన్‌చార్జ్‌ సబ్ రిజిస్టార్ నారాయణస్వామి తన ఇంటి సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నాయక్ నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు. కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ నారాయణస్వామి అది కమర్షియల్ ల్యాండ్ అని, అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం కావాలని డిమాండ్ చేశాడు. ఐదు లక్షల రూపాయల లంచం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి రియల్టర్ […]

వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు నిధుల విడుదల

మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాదాపు రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి 20లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించింది. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించడంతో భూ బాధితుల నుంచి సానుకూల స్పందన లభించింది.

గవర్నమెంట్ ఉద్యోగి నిర్వాకం.. సిబ్బంది వాట్సాప్ గ్రూపులో ఆ ఫోటోలు

గుంటూరు జిల్లాలో ఓ ఉద్యోగి నిర్వాకంపై తోటి సిబ్బంది మండిపడుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే ఆఫీసర్ ఒకరు.. సిబ్బందికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో అశ్లీల ఫోటోలను పోస్ట్ చేశారు. అవి కూడా మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఫోటోలు. ఈ ఫోటోలు చూసిన సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. అతగాడిని వేరేచోటుకు బదిలీ చేశారు. తిరిగి గుంటూరుకు రాకుండా చూడాలని..అలాగే కఠిన చర్యలు తీసుకోవాలని మెప్మాలోని మహిళా […]

బంగ్లాలో తాలిబన్‌ తరహా పాలన..! మహిళల దుస్తువులపై ఆంక్షలు

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం మరోసారి వివాదంలో చిక్కకున్నది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలు ధరించే దుస్తులపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. యూనస్‌ తాలిబన్‌ పాలన తరహా ఆదేశాలపై మండిపడుతున్నారు. చీరలు, సల్వార్‌ కమీజ్‌ సహా ఒళ్లంతా కప్పి ఉండేలా దుస్తులు ధరించాలని ఆదేశించింది. మహిళలు హెడ్‌స్కార్ఫ్, హిజాబ్ ధరించాలని, ఫార్మల్ షూస్, శాండల్స్ ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ […]

యూట్యూబ్‌ డైట్ ప్రాణాన్ని తీసింది

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెల్ లో పదిహేడేళ్ల యువకుడు శక్తిశ్వరన్ యూట్యూబ్ వీడియోలు చూసి స్వయంగా ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గే ప్రయత్నంలో అకాల మరణానికి గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON