loader

రేపట్నుంచే రెండో విడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌.. భారీగా కన్వినర్ కోటా సీట్లు!

జులై 25, 2025వ తేదీ నుంచి రెండో విడత ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. వీరికి జులై 26న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 26, 27 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు, జులై 30వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది. తొలి విడతలో మొత్తం 23,074 సీట్లు మిగిలాయి. మరికొన్ని కాలేజీల్లో కోర్‌ బ్రాంచీలైన ఈసీఈ, సివిల్, మెకానికల్‌ గ్రూపు సీట్లకు అనుమతికి దాదాపు లైన్‌ […]

కేటీఆర్‌ను ఆశీర్వదించిన కేసీఆర్ దంప‌తులు

తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. త‌న‌ తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి వారికి పాదాభివందనం చేశారు.ఈ సందర్భంగా వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కేసీఆర్,శోభమ్మ దంపతులు కేటీఆర్‌ను ఆశీర్వదించారు.

లోయలో పడిన ఆర్టీసి బస్సు.. ఏడుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలతో సహా ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. సర్కాఘాట్ నుంచి దుర్గాపూర్‌కు బస్సు వెళ్తుండగా సుమారు 25 మీటర్ల లోతులోలోయలో పడింది. గాయపడిన వారిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. క్రిటికల్‌గా ఉన్న ప్యాసింజర్లను బిలాస్‌పూర్ ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు.

రాజస్థాన్ సన్యాసిని రాసలీలల వీడియో వైరల్- సనాతన ధర్మంపై కుట్ర జరిగిందన్న సాధ్వీ

సాధ్వీ ప్రేమ్ బైసా అనే రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవత్ కథా వక్త మరో అథ్యాత్మిక వేత్త వీరంపురి మహారాజ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోతో వివాదంలో చిక్కుకున్నారు. వీడియో వైరల్ కావడంతో ఆమె స్పందించారు. సాధ్వీ ప్రేమ్ బైసా ఈ వీడియో పాతదని, మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసి తనను అపఖ్యాతి పాలు చేసేందుకు ఉపయోగించారని ఆరోపించారు. వీడియోను బహిరంగం చేయకుండా ఉండేందుకు 20 లక్షలు డిమాండ్ చేసి తనను బ్లాక్‌మెయిల్ […]

కేటీఆర్ బర్త్‌డే.. విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ.

కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఒక మంచి పనికి వేదికయ్యాయి. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా విద్యార్థులకు సహాయం చేశారు. బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో.. విద్యార్థుల సౌకర్యార్థం 100 బెంచీలను అందించారు. అంతేకాకుండా.. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువులో తొలి రెండు స్థానాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు 20 సైకిళ్లను బహుకరించారు.

బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి అన్నారు. దక్షిణ ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో 7.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది అని తెలిపారు. ఇది రానున్న 24 గంటలలో ఈ అల్పపీడనం బలపడుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

ఏపీలో 50 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం- ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 42 అంశాలపై చర్చ జరిగింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ద్వారా సుమారు ₹50,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) సంబంధిత ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సాగు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సంబంధించిన నాలా చట్ట సవరణపై చర్చ జరిగింది.

చెస్‌ ప్రపంచకప్ ఫైనల్‌కు దివ్య దేశ్‌ముఖ్.. తొలి భారత మహిళగా రికార్డు

దివ్య దేశ్‌ముఖ్ మాజీ ప్రపంచ ఛాంపియన్ ఝోంగ్వీ టాన్‎ను ఓడించి మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, ఆమె 2026లో జరగనున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‎కు కూడా అర్హత సాధించింది. దివ్య దేశ్‌ముఖ్ ఈ టోర్నమెంట్‌లో అంతకుముందు చైనాకు చెందిన జోనెర్ ఝూ, స్వదేశీ క్రీడాకారిణి డి హారికాను ఓడించింది. సెమీఫైనల్‌లో కూడా ఆమె తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఆమె టైటిల్‌కు ఒక అడుగు […]

భారత్‌-యూకే మధ్య కీలక ట్రేడ్‌ డీల్‌..

భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యూకే పర్యటన సందర్భంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య కీలక ట్రేడ్‌ డీల్‌ కుదిరింది. భారత్‌-యూకేల మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ, యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సమక్షంలో ఇదరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

నిసార్ శాటిలైట్‌ కోసం చేతులు క‌లిపిన భార‌త్‌, అమెరికా..

భారత్‌-అమెరికా సంయుక్తంగా భూగోళాన్ని పరిశీలించేందుకు తొలిసారిగా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. ఈ ప్రయోగం తర్వాత నిసార్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఈ ఉపగ్రహం 743 కి.మీ ఎత్తులో తిరుగుతూ అడవులు, పంటలు, హిమపర్వతాలు, సముద్రాలు అన్నింటినీ గమనిస్తుంది. వ‌ర్షాలు కురుస్తున్నా, వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించ‌క‌పోయినా NASA-ISRO రాడార్ సిస్టమ్స్ డేటా సేక‌రిస్తూనే ఉంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON