loader

చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు : పవన్

“హరిహర వీరమల్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ రాజకీయ భావోద్వేగాలపై కూడా స్పందించారు తన సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా విజయం కోసం మద్దతుగా పోస్ట్ చేసిన నారా లోకేశ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టాను అంటాడు” అంటూ విమర్శించే వారిని బావిలో కప్పలతో పోల్చారు. ఆవిషయాన్ని ఎత్తి చూపుతూ, తన పేరులోనే గాలి ఉందని, కాబట్టి ఎక్కడైనా […]

వేదిక‌పై గురువు పాదాల‌కి న‌మ‌స్క‌రించి ఆయ‌న‌ని శాలువాతో స‌త్క‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మ‌రి కొద్ది నిమిషాల‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ప్రీమియ‌ర్ షోస్ జ‌రుపుకోనుంది. విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పవన్ అభిమానులకు ప్ర‌త్యేకంగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో సినిమా యూనిట్‌తో పాటు రాజకీయ నాయకులు, పవన్ స‌న్నిహితులు కూడా హాజరయ్యారు. నటుడిగా తనను తీర్చిదిద్దిన గురువుకు సన్మానం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ మానవీయతను, వినయాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇక ఈవెంట్‌లో ఉత్త‌రాంధ్ర పాట‌లు కూడా పాడి అల‌రించారు ప‌వ‌న్. ఎంఎం కీరవాణిని కూడా […]

బొగత జలపాతం ఉగ్రరూపం..పర్యాటకులకు నో ఎంట్రీ

ములుగు జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన కరుస్తున్న వర్షాలతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకుల సందర్శనను నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి నోటీసులు వచ్చేవరకు బొగత జలపాతం సందర్శనకు పర్యాటకులను అనుమతించబోమని తెలిపారు. ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.

 ఏమైంది అక్కా మీకు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

భర్తను చంపి ఏకంగా డోర్ డెలివరీ చేసింది ఓ భార్య. నంద్యాల జిల్లాకి చెందిన ర‌మ‌ణ పిడుగురాళ్ల‌కు చెందిన ర‌మ‌ణ‌మ్మతో 20ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. నచ్చజెప్పేందుకు తనే వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆమె కుటుంబ స‌భ్యులు గొడవకు దిగారు. ఘర్షణ పెద్ద‌ది కావ‌డంతో ర‌మ‌ణ‌మ్మ ,ఆమె సోదరుడు దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డు మృతిచెందాడు. రమణయ్య మృతదేహాన్ని నంద్యాల‌కు తీసుకువ‌చ్చి అత‌డి ఇంటి ద‌గ్గ‌రే […]

వీరమల్లుకు నిరసన సెగ.. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చించేసిన కన్నడిగులు

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కానుండగా, కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు టైటిల్‌తో ప్రచారం చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బళ్లారిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను కన్నడ భాషాభిమానులు తొలగించారు. కన్నడలో కాకుండా తెలుగులో ప్రచారం చేయడంపై వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మృతదేహాల తారుమారు ఆరోపణలు.. స్పందించిన కేంద్రం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు సంచలన ఆరోపణలు చేశారు. యూకేకు పంపిన మృతదేహాలు తమ వారివి కావని డీఎన్ఏ పరీక్షల్లో తేలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సహాయం విషయంలోనూ బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆరోపించారు. రెండు మృతదేహాలు తారుమారైనట్టు ఫ్యామిలీ ఆరోపణలు ఆరోపణలపై స్పందించిన భారత ప్రభుత్వం.. డీఎన్ఏ పరీక్షల్లో సమస్యపై కూడా యూకే అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం’ అని విదేశాంగ శాఖ […]

పొరుగు రాష్ట్రంలో టీ, కాఫీ, పాలు బంద్

కర్ణాటక రాష్ట్రంలో జీఎస్‌టీ నోటీసుల‌కు వ్య‌తిరేకంగా చిరు వ్యాపారులు ఈ నిర్ణయం టీ, కాఫీల విక్రయాలను నిలిపివేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. నిర‌స‌న‌లో భాగంగా స్థానికంగా ఉన్న కేఫ్‌, బేకరీలతో కేవ‌లం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీని మాత్ర‌మే విక్రయిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చిరు వ్యాపారులు తమ దుకాణాల్లో యూపీఐ చెల్లింపుల‌ను పూర్తిగా నిలిపివేశారు.ఓన్లీ క్యాష్ ఇస్తేనే వ్యాపారలావాదేవీలు చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 25న రాష్ట్రవ్యాప్త బంద్‌ నిర్వహిస్తామని చిరువ్యాపారులు హెచ్చరించారు.

కోర్టు వాయిదాకి వస్తే పీకలు కోసి చంపేశారు- నర్సరావుపేటలో జంట హత్యలు

చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన తండ్రీకొడుకులను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన ఘటన నర్సరావుపేటలో జరిగింది. వీరస్వామిరెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటారు. కేసులో విచారణకు హాజరయ్యారు.వారు వస్తారని తెలిసి ముందుగానే పక్కాగా ప్లాన్ చేసి.. కిడ్నాప్ చేసి.. చంపేశారు. వారి మృతదేహాలను  బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో పడేశారు. గడ్డం అనిల్‌కుమార్‌రెడ్డి అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. సుపారి గ్యాంగులతో ఈ […]

సంక్షోభాల్లో అవకాశాలు వెతకాలి.. సీఎం చంద్రబాబు

ఏడారి మధ్యన అద్భుత నగరంగా దుబాయ్ దాన్ని చూస్తే అసూయగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంక్షోభాలనైనా అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. “1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ, మరో సాంకేతిక విప్లవం దశలో ఉన్నాం,” అని 2047 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌ తనదైన […]

అడ్డంగా బుక్కైన మింత్రా.. రంగంలోకి దిగిన ఈడీ

మింత్రాపై ఈడీ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. రూ.1,654.35 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించినందుకు మింత్రా తో పాటు దాని అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. హోల్‌సేల్ వ్యాపారం చేసే సంస్థలు నేరుగా కస్టమర్లకు ఉత్పత్తులను అందించకూడదు. రిటైలర్లకు లేదా ఇతర వ్యాపార సంస్థలకు హోల్‌సేల్‌గా అమ్మాలి. అయితే మింత్రా మాత్రం తన అనుబంధ సంస్థ ద్వారా నేరుగా కస్టమర్లకు ఉత్పత్తులను అమ్మింది. ఇది ఫెమా ఉల్లంఘనల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON