రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ డెడ్‌లైన్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. 20 నెలలు గడిచిపోయాయి. రూపాయి పింఛను పడలేదని ఆరోపించారు. ఆగస్టు మొదటి వారంలోపు పింఛన్లు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెడుతున్నామన్నారు. ఆలోగా వారి పింఛన్ బకాయిలు డబ్బులు ఇవ్వకుంటే ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో లక్షలాది మందితో దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల గర్జన కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు.