loader

ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం..పదవికి జగదీప్ ధన్‌ఖర్‌ రాజీనామా

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా, వైద్యుల సలహా మేరకు తక్షణం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఎ) ప్రకారం ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో సహకరించారని, ఇది తనకు చాలా ఆహ్లాదకరమైన అనుభవమని పేర్కొన్నారు. అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మంత్రివర్గానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు […]

జీవో 49పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు ఇది ఊరట కలిగించే పరిణామం. ‘కొమురంభీమ్ కన్జర్వేషన్ కారిడార్’ పేరిట జారీ చేసిన జీవో 49 (GO 49)ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.జీవో 49కు సంబంధించి ఆదివాసీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు సాగుతున్నాయి.

స్కూళ్లలో హైరిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు ఉండాల్సిందే..సీబీఎస్ఈ

సీబీఎస్ఈ బోర్డు పరిధిలోని అన్ని స్కూళ్లలో కూడా హైరిజల్యూషన్ సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్కూళ్ల ఎంట్రీ, ఎక్జీట్, క్యాంటీన్, ప్లేగ్రౌండ్, స్టోర్ రూమ్, లైబ్రరీ, తరగతి గదులు ప్రతి చోట హైరిజల్యూషన్ తో కూడిన సీసీటీవీ కెమారాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అవి ఆడియో, వీడియోలతో పాటు కూడిన హైరిజల్యూషన్ తో పదిరోజులు నిల్వ ఉంచేవిగా చూసుకుని ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ అన్ని స్కూళ్లకు ఆదేశించింది. ముఖ్యంగా విద్యార్థుల భద్రత తమకు ముఖ్యమని సీబీఎస్ఈ […]

ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ ఉచిత బస్సు పథకం

ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేరో టిక్కెట్‘ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు… ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి… 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ… వంటి వివరాలు ఆ టిక్కెట్‌లో పొందుపరచాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై […]

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంపై కేటీఆర్ హర్షం

ిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం స్పిరిట్‌తో ప్రముఖ న్యూరోఫిజిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ పాతకోటి, ఆయన సతీమణి డాక్టర్ ప్రణయవాణి  పేదింటికి చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని సుస్మిత వైద్య విద్య కోసం లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు.  అలాగే మహబూబ్ నగర్ జిల్లా తిరుమలగిరి తండాకు చెందిన ప్రతిభావంతమైన నిరుపేద విద్యార్థి చంద్రశేఖర్ చదువుల కోసం వ్యాపారవేత్త నాయిని వెంకటేశ్వర రెడ్డి ల్యాప్‌టాప్‌, లక్ష రూపాయల చెక్కును అందజేశారని చెప్పారు.

కలెక్టర్లతో సిఎం వీడియో కాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ

జిల్లా కలెక్టర్లతో సిఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వానా కాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్‌కార్డు పంపణీపై సిఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రలు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల పరిధిలోని ఐఎఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సిఎం తెలిపారు. కలెక్టర్ల కార్యాచరణ రిపోర్టు రోజు తనకు పంపించాలని స్పష్టం చేశారు.

దూకుడు పెంచిన ఈడీ..సెలెబ్రెటీలకి నోటీసులు

బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రెటీలు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అంద‌జేయ‌డం జ‌రిగింది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్‌రాజ్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అలానే వచ్చే నెల 6న విజయదేవరకొండ, 13న మంచులక్ష్మి విచారణకు రావాలని ఈడీ తెలిపింది.

బ్రిడ్జిపై రైలు వెళ్తుండగా కూలిన బేస్‌ భాగం.. తప్పిన పెను ప్రమాదం

హిల్‌ స్టేట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ లో పఠాన్‌కోట్‌ మీదుగా ఢిల్లీ-జమ్ము మార్గంలో చక్కి నదిపై ఈ వంతెనను నిర్మించారు. అయితే భారీ వర్షాల కారణంగా నదికి వరద పోటెత్తింది. బ్రిడ్జి కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. వందలాది ప్రయాణికులతో ఓ రైలు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

కేరళ మాజీ సీఎం వి.ఎస్. అచ్యుతానందన్ కన్నుమూత!

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు వి.ఎస్. అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తిరువనంతపురంలోని ఎస్.యు.టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సొమవారం మధ్యహ్నం తుదిశ్వాస విడిచారు. 1964లో CPI జాతీయ మండలి నుండి తప్పుకున్న 32 మంది నాయకులలో VS కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన CPM వ్యవస్థాపక నాయకులలో ఒకరిగా ఉన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, CPM రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు, LDF కన్వీనర్, సహా అనేక పదవులను […]

హైదరాబాద్- సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు భారీ వర్షాలు

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. సోమవారం సాయంత్రం నాలుగున్నర దాటిన తర్వాత ఎనిమిదిన్నర వరకూ సిటీ అంతటా భారీ వర్షాలు పడతాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి. గత మూడు రోజులుగా సిటీలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. సోమవారం వెస్ట్ లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. ట్రాఫిక్ కారిడార్ గా పేరున్న ఐటీ కారిడార్ కూడా వెస్ట్ పరిధిలోకే వస్తుంది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతాయని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON