తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.విమానం టెకాఫ్ అయిన వెంటనే పైలట్లు ప్రాబ్లమ్ గుర్తించారు.సుమారు 45 నిమిషాల పాటు ఫ్లైట్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత తిరిగి తిరుపతి ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.ఈ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తడంతో వారంతా భయాందోళన చెందారు.

