loader

సెమీస్‌కు చేరువైన హంపి.. డ్రాతో సరిపెట్టుకున్న హారిక, దివ్య

జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో కోనేరు హంపి జోరు కొనసాగిస్తోంది. కఠినమైన ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వస్తున్న భారత గ్రాండ్‌మాస్టర్ సెమీ ఫైనల్‌కు చేరువైంది. శనివారం జరిగిన క్వార్టర్స్‌ తొలి రౌండ్‌లో ఆమె చైనా ప్లేయర్ యుక్జిన్ సాంగ్‌ను ఓడించింది. తర్వాతి గేమ్‌ను డ్రా చేసుకున్నా చాలు హంపి సెమీస్‌ చేరడం ఖాయం. అయితే.. మహిళా బృందం మాత్రం నిరాశపరిచింది. ద్రోణవల్లి హారిక, దివ్యా దేశ్‌ముఖ్‌లు డ్రాతో సరిపెట్టుకున్నారు.

మెరిసిన మంధాన, దీప్తి.. ఇంగ్లండ్ ముందు స్వల్ప లక్ష్యం

తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో భారీ స్కోర్ చేయలేకపోయింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్‌లో స్మృతి మంధాన(42) చెలరేగినా.. మిడిలార్డర్ తేలిపోయింది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బౌలర్లు చెలరేగగా ప్రధాన ప్లేయర్లు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మంధాన ఔటయ్యాక దీప్తి శర్మ (30), అరుంధతి రెడ్డి(14)లు పోరాడడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

పిల్లల్ని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి: చంద్రబాబు

పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగితే ప్రజలు క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాక ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ అధికారులు అందించిన వివరాలను సీఎం పరిశీలించారు. ఆపై తిరుపతికి వెళ్లి కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దేవాలయం పరిసరాల్లో పారిశుధ్య సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, చెత్త తొలగించారు. .

రేపు అంబర్ పేట మహంకాళి అమ్మవారి బోనాలు

అంబర్‌పేట మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఈ నెల 20, 21వ తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జూలై 6న ఘటం ఊరేగింపుతో ప్రారంభమైన ఉత్సవాలు జూలై 19 వరకు అంబర్‌పేట పరిసర బస్తీల్లో విస్తరించి ఘనంగా జరిగాయి. జూలై 20న ఆదివారం ఉదయం 4 గంటలకే అభిషేకంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. ఈ రోజంతా […]

సీఆర్పీఎఫ్‌ జవాన్‌ను కొట్టి, కాళ్లతో తన్నిన కన్వారియాలు

కన్వారియాలు రెచ్చిపోయారు. రైల్వే స్టేషన్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌పై దాడి చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు కాళ్లతో తన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో వారిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌కు కొందరు కన్వారియాలు రైలు టిక్కెట్లు కొనే విషయంలో అక్కడున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌తో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అతడ్ని కొట్టారు. సీఆర్పీఎఫ్‌ జవాన్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఆయనను కిందపడేసి కాళ్లతో తన్నారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని ఆ జవాన్‌ను కాపాడారు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం… వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్…

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి ఈరోజు విజయవాడ చేరుకుని సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డిని ఆరు గంటల పాటు విచారించిన అధికారులు అనంతరం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు.

ఏపీలో 199 మంది పోలీసు అధికారులను పక్కన పెట్టారు

ఆంధ్రప్రదేశ్‌లోని 199 మంది సీనియర్ పోలీసు అధికారులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ గురుమార్తి ప్రధాని సహా పలువురికి ఫిర్యాదు చేశారు. 4 మంది ఐపీఎస్ అధికారులు, 4 మంది నాన్-క్యాడర్ పోలీసుసూపరింటెండెంట్లు, 1 ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డీఎస్పీలు, 119 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని తెలిపారు వారందరినీ వేకెన్సీ రిజర్వ్ (VR) జాబితాలో ఉంచారని.. ఎటువంటి అధికారిక పోస్టింగ్‌లు, బాధ్యతలు వేతనం లేకుండా DGP కార్యాలయానికి […]

ఖచ్చితంగా అది సిగ్గులేని చర్య.. WCL టోర్నీకి బీసీసీఐ అనుమతిపై శివసేన ఎంపీ

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని మర్చిపోక ముందే.. పాక్ లెజెండ్స్‌తో భారత మాజీ క్రికెటర్లు మ్యాచ్ ఆడటంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది బీసీసీఐని తప్పుబట్టారు. ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే.. మ్యాచ్‌లు నిర్వహించడం నైతిక దివాలాకోరుతనం అవుతుందని ఆమె విమర్శించారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఇలాంటి చర్యలకు ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. ఇది దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆమె అన్నారు.

గ్యాంగ్‌స్టర్‌కు గుండు కొట్టించి ఊరేగించిన పోలీసులు.. కోర్టును ఆశ్రయించిన భార్య

అరెస్ట్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌కు పోలీసులు గుండు కొట్టించారు. అతడి మీసాలు తీయించారు. ఆ తర్వాత బహిరంగంగా ఊరేగించారు. దీంతో గ్యాంగ్‌స్టర్‌ భార్య హై కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది.గ్యాంగ్‌స్టర్‌ జుబైర్ మౌలానాపై హత్యాయత్నం, దాడి, కిడ్నాప్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోలీస్‌ బృందంపై దాడి వంటి 50కు పైగా కేసులు పలు పోలీస్‌ స్టేషన్లలో […]

వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌, రాయిటర్స్‌కు లీగల్‌ నోటీసులు పంపిన పైలట్ల సంఘం

అహ్మదాబాద్‌ విమానం ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలపై ఇండియన్‌ పైలట్ల సంఘం (FIP) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌, రాయిటర్స్‌కు లీగల్‌ నోటీసులు పంపింది. తప్పుడు కథనాలు ప్రచారం చేసినందుకు రెండు సంస్థలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. అధికారికంగా నిర్ధారణ లేకుండా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు చేస్తూ మరణించిన పైలట్లదే తప్పు అని ఏ వార్తనైనా మీడియా సంస్థలు ప్రచారం చేయకూడదని పైలట్ల సంఘం పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON