loader

మూడు నెలల్లో రూ.26 వేల కోట్లు.. దుమ్మురేపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అదరగొట్టింది. 2025-26 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో అద్బుత లాభాలతో దుమ్మురేపింది. కంపెనీ నికర లాభం 78.32శాతం పెరిగి రూ.26,994 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.15,138 కోట్లుగా ఉంది.కానీ ఈ సారి రూ.10వేల కోట్ల అధిక లాభం వచ్చింది.కంపెనీ మొత్తం ఆపరేంటింగ్ ఆదాయం కూడా పెరిగింది. రిలయన్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గతేడాది తొలి త్రైమాసికంలో రూ.2,36,217 కోట్లగా ఉంది. ఇప్పుడు రూ.2,48,660 కోట్లుగా ఉంది.

ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షం

హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం తన ప్రతాపాన్ని చూపుతోంది. కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మైండ్ స్పేస్, ఐకియా, మాదాపూర్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రాత్రి వేళ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసింది.

తూర్పు భారతం అభివృద్ధికి వికసిత్ బీహార్ కీలకం: ప్రధాని మోడీ

ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్‌జేడీ బూటకపు హామీలు ఇచ్చి పేదల దగ్గర భూముల్ని కాజేసిందని, ‘ల్యాండ్ ఫర్ స్కామ్’ను ఉదహరిస్తూ ప్రధాని మోడీ ఆర్‌జేడీని తూర్పారబట్టారు. ఈ పరిస్థితుల్లో తూర్పు భారతం అభివృద్ధికి వికసిత్ బీహార్ కీలకమని ఆయన పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం మోతిహరిలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ‘బనాయేంగే నయా బీహార్, ఫిర్ ఏక్‌బార్ ఎన్‌డిఏ సర్కార్ ’ (మరోసారి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం లోకి వస్తే […]

ఎంపీలు..అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు..సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌లో మన ఎంపీల పని తీరు బాగుంది. క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. చర్చించే అంశాలపై రాష్ట్ర వాదనను సమర్థవంతంగా వినిపిస్తున్నారు.’ రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలు మనకు ఓట్లు వేసి అధికారం ఇచ్చారు, పెద్ద సంఖ్యలో ఎంపీలను ఇచ్చారు. ‘అనవసర విషయాల్లో ఎంపీలు ఎక్కడా జోక్యం చేసుకోవద్దు. వన్ టైం ఎంపీలుగా ఉండేలా ప్రవర్తించవద్దు. ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షల మేరకు మీరు పని చేయాలి.అని సీఎం చంద్రబాబు […]

అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం 500కోట్లతో ట్రస్ట్

ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం టాటా సన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ‘ది AI-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్’ను రిజిస్టర్ చేసినట్లు ప్రకటించింది. ఆయా కుటుంబాలకు ఇచ్చే పరిహారం ఇస్తారు. అలాగే దీర్ఖకాలంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడినవారి వైద్య ఖర్చులు, ఇతర బాధితులకు తక్షణ , దీర్ఘకాలిక సహాయం అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. టాటా సన్స్ , టాటా ట్రస్ట్‌లు కలిసి రూ. 500 కోట్లు […]

చంద్రబాబూ! మమ్మల్ని బతకనివ్వండి..

‘గతంలో పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నానని చెప్పారు. మా ప్రాజెక్టులను పూర్తి చేసుకోనిచ్చి మమ్మల్ని బ్రతకనివ్వండి’అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు తరలించే రాయలసీమకు లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మీ ఉదారతను ప్రదర్శించండి.’అని విజ్ఞప్తి చేశారు.మా విజ్ఞప్తులు మీరు వినకపోతే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. ఈ పోరాటానికి నాయకత్వం నేను వహిస్తాను’అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

భారీ వర్షాలకు నిండా మునిగిన సికింద్రాబాద్ పైగా కాలనీ

హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా సికింద్రాబాద్‌లోని పైగా కాలనీ నీటమునిగింది. భారీ వర్షాల కారణంగా కాలనీలోని రోడ్లు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు నీటమునిగాయి. కొన్ని పరిశ్రమలు , షోరూమ్‌లలో కూడా వరద నీరు చేరింది, దీని వల్ల అక్కడ ఉద్యోగులు చిక్కుకుపోయారు. పైగా కాలనీ నివాసితులు ఈ వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి వర్షాకాలంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు

లింక్‌పై క్లిక్ చేస్తే కేంద్రం 46,715 సాయం..

ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ప్రతి ఒక్కరికి రూ.46,715 సాయం అందిస్తోంది. దీన్ని కోసం రిజిస్టర్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ కేటుగాళ్లు కొత్త స్కామ్‌కు తెరదీశారు.  కొన్ని రోజులుగా ఓ లింక్ వాట్సాప్ లో తెగ వైరల్ అయ్యింది. పలువురు దీనిని నమ్మి లింక్‌పై క్లిక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ లింక్‌పై క్లిక్ చేయొద్దని ,గ్రూపుల్లో షేర్ చేయొద్దని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. […]

జల వనరులను సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ ఉత్ప‌త్తి : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకుంటూ, జల విద్యుత్‌ కేంద్రాల్లో అన్ని యూనిట్లను ఉపయోగంలోకి తీసుకువస్తూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇందన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జున‌ సాగర్‌ డ్యాం ప్రధాన జల విద్యుత్‌ కేంద్రంను శుక్రవారం ఆయ‌న సందర్శించారు. రాష్ట్రంలోని జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లలో ఉపయోగంలో లేని యూనిట్లను ఉపయోగంలోకి తేవాలన్నారు.

దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు.. 3 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్‌ను సంప్రదించమని అధికారులు తెలిపారు రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ల వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని రోడ్లు నాలాలను తలపించాయి. ఐటీ కారిడార్ రోడ్లు ‘స్విమ్మింగ్ పూల్స్’ను పోలి ఉన్నాయని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON