loader

క్లైమోర్ మైన్లే నన్నేం చేయలేకపోయాయి..వీళ్లేం చేస్తారు- చంద్రబాబు

జలహారతిలో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తాను కంకణం కట్టుకున్నానని.. కానీ చాలా మంది ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. విమర్శలు చేసినా, బూతులు తిట్టినా, శాపాలు పెట్టినా అవేవీ తన మనస్సుకు రాలేదని.. ఎందుకంటే క్లైమోర్ మైన్లే ఏం చేయలేనప్పుడు, ఇలాంటి వాళ్లు ఏం చేయలేరు అంటూ చంద్రబాబు […]

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నాపై ఏదైనా డ్రగ్స్ కేసు ఉందా? ఉంటే దమ్ముంటే బయటపెట్టు” అంటూ స్పష్టమైన సవాల్ విసిరారు.రేవంత్ చిట్‌చాట్ పేరుతో ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

థాయ్‌లాండ్‌లో బౌద్ధ సాధువులను ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్

థాయ్‌లాండ్ దేశంలో ఓ మహిళ బౌద్ధ సాధువులను బ్లాక్ మెయిల్ చేసిన ఘటన సంచలనంగా మారింది. ” Ms Golf ” అనే మహిళ సుమారుగా 9 మంది బౌద్ధ సాధువులతో శృంగారం చేసింది. ఆ తర్వాత వారిని ఫోటోలు,వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి గత 3 ఏళ్లలో సుమారుగా 11.9 మిలియన్ డాలర్లు(రూ.100 కోట్లు) సంపాదించింది. విచారణలో భాగంగా ఆమె ఉంటున్న ఇంటిని సోదా చేసిన పోలీసులకు 80వేలకు పైగా ఫోటోలు మరియు వీడియోలు లభించాయని […]

ప్రియాంక గాంధీ భర్తపై ఈడీ ఛార్జిషీట్

షికోపూర్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, వాద్రాకు చెందిన కంపెనీ 2008లో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని […]

చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద..

ప్రపంచ నెంబర్ 1 చెస్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్ వరుస ఓటములతో ఒత్తిడిలో పడిపోయాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్లు అతడి ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు టోర్నమెంట్లు గెలుచుకున్న ప్రజ్ఞానంద ఇప్పుడు కార్ల్‌సన్‌ను క్లాసికల్, రాపిడ్, బ్లిట్స్ మూడు ఫార్మాట్లలోనూ ఓడించాడు. కార్ల్‌సన్‌ను ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలవడం విశేషం.

బండి సంజయ్ వ్యాఖ్యలపై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్

42 శాతం రిజర్వేషన్లు ముస్లింలను ఎలా బీసీల్లో కలుపుతారు? అంటూ చేసిన వ్యాఖ్యలపై. బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన కేంద్రం, ఇక్కడ మాత్రం బీసీలను బలహీనపరచే ప్రయత్నం చేస్తోందని మీడియా సమావేశంలో.. ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ నిర్వాకంతో అంబేద్కర్‌ విదేశీ విద్య ఆశలు గల్లంతు

అంబేద్కర్‌ విదేశీ విద్యా నిధి కింద ఉన్నత చదువుల కోసం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నుంచి గతంలో ప్రతి ఏటా 90 మందికి పైగా విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు. ఈ విద్యా సంవత్సరం 32 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన చేసి షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిటీ విదేశాలకు వెళ్లే విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.ఇంకా కమిటీ వేయలేదని, గత సంవత్సరం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల ఖాతాలలో ఇప్పటి వరకు విద్యానిధి నగదు జమ […]

ఆదిలాబాద్‌లో మైక్రో ఫైనాన్స్ ముసుగులో భారీ మోసం

ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి భారీ హంగామా . పలువురికి ఆర్థిక సహాయం చేశాడు. ప్రజాప్రతినిధులను, పెద్దలను పిలిచి సన్మానాలు చేశాడు. బౌన్సర్లను ఏర్పాటు చేసుకోని రెండు నెలల క్రితం డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు స్థాపించాడు. మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాలు అంటూ ప్రకటన చేశారు. ఆ పనుల కోసం దాదాపుగా 400 మందికిపైగా ఒక్కొక్కరి వద్ద రూ.20,000 వసూలు చేశారు. మంగళవారం సాయంత్రం వేతనాలు చెల్లిస్తామని చెప్పి అదే రోజు సాయంత్రం నుంచి కార్యాలయాన్ని […]

మెటా ఏఐ మిషన్.. సూపర్ క్లస్టర్లతో మేధో విప్లవానికి రంగం సిద్ధం!

మెటా ప్రణాళికలో తొలి మెరుగైన క్లస్టర్ పేరు ‘Prometheus’ దీని సామర్థ్యం 1341 మెగావాట్లు. ఏఐ మోడళ్లను నిర్మించాలంటే వేలాది గంటల గణన, డేటా శిక్షణ అవసరం అవుతుంది. దీన్ని సాధారణ కంప్యూటర్లతో చేయడం అసాధ్యం. అందుకే సూపర్ క్లస్టర్లు, అంటే భారీ శక్తితో పని చేసే డేటా సెంటర్లు అవసరం అవుతున్నాయి.ఏఐ మోడళ్ల శిక్షణకు సాధారణంగా 12-14 మెగావాట్ల శక్తి అవసరం అవుతుంది. కానీ మెటా అభివృద్ధి చేస్తున్న క్లస్టర్ మాత్రం దానికి పన్నెండు రెట్లు […]

దేవుడి సాక్షిగా చెబుతున్నా ఆ హత్యతో నాకు సంబంధం లేదు: TDP ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య సంచలనంగా మారింది. శ్రీకాళహస్తి ఎంఎల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డిపై వినుత ఆరోపణలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో స్పందించారు. రాయుడు హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. దేవుడి మీద, తన పిల్లల మీద ప్రమాణం చేస్తున్నాను అన్నారు. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నారు. ఈ ఘటనలో తన ప్రమేయం లేదని.. .. రాజకీయ కారణాలతో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON