loader

వాళ్లకు నిధులు, వీళ్లకు నీళ్లు, తెలంగాణ ప్రజలకు బూడిద: కెటిఆర్

ముసుగు వీడింది, నిజం తేటలతెల్లమయ్యింది. 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు. బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి..గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అంటూ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలి.. మోడీకి ఖర్గే, రాహుల్ విజ్ఞప్తి

జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖ పంపించారు. ఇది హోదా పునరుద్ధరణే అవుతుందని వివరించారు. 21 నుంచి ఆరంభమమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాసంపూర్ణ స్థాయిలో దక్కేలా చేసేందుకు తగు బిల్లు తీసుకువచ్చి, చట్టం రూపొందించాలని ఈ లేఖలో వీరిరువురు తెలిపారు.

పీఎం ధన్‌ ధాన్య యోజనకు మోదీ కేబినెట్‌ ఆమోదం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం ధన్‌ ధాన్య యోజనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏటా రూ.24వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్‌ని అమలు చేయనున్నారు.

కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు బుధవారం కొనసాగింది. ఇందులో భాగంగా ఆయన కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఖేలో ఇండియా, జలక్రీడలు, స్టేడియంల అభివృద్ధి, బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి కీలక అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరణాత్మక ప్రతిపాదనలు సమర్పించారు.

కృష్ణా బోర్డు అక్కడ.. గోదావరి బోర్డు ఇక్కడ.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పోలవరం- బనకచర్లపై టెక్నికల్‌, అడ్మినిస్ట్రేషన్‌ సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నది బోర్డు అమరావతిలో గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. .

పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాలపై సంచలన వ్యాఖ్యలు..!

ఈ రోజున తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఆయన చేసిన కుట్రల పైన పలు వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంలోని రప్పా రప్పా డైలాగులు చెప్పడంతో వైసిపి శ్రేణులను అరెస్టు చేసింది కూటమి ప్రభుత్వం సినిమా డైలాగులు పెడితే క్రిమినల్ కేసులు పెడుతున్నారు.  పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలలో మరి ఇంకా దారుణమైన డైలాగులు ఉంటున్నాయి.. మరి వారి సినిమాలలో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటూ ఫైరయ్యారు.

విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. జెమిని AI ప్రో ఇప్పుడు ఫ్రీ

టెక్‌ జెయింట్‌ గూగుల్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఒక బంపరాఫర్‌తో ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన విద్యార్థుల స్కిల్స్ పెంచేందుకు, ఏడాది పాటు జెమిని AI ప్రో (Gemini Pro) సూట్‌ను ఉచితంగా అందిస్తోంది. 2025 సెప్టెంబర్ 15లోపు రిజిస్టర్ చేసుకున్న 18 ఏళ్లు పైబడిన స్టూడెంట్స్ అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. AI టెక్నాలజీతో వేగంగా నేర్చుకోవడం, కాలేజీ ప్రాజెక్టులను ఈజీగా చేయడం, ఫ్యూచర్‌కి అవసరమైన స్కిల్స్‌ను నేర్చుకుని కెరీర్‌లో దూసుకెళ్లేలా స్టూడెంట్స్‌కు సపోర్ట్ […]

ఆ ఊరికి శాపంగా ధరణి.. 1000 ఎకరాల భూములు అసైన్డ్ జాబితాలోకి

నిర్మల్ జిల్లాలోని న్యూ కంజర గ్రామంలో రైతులకు సుమారు 33 ఏళ్ల క్రితం అనగా 1982 సంవత్సరంలో.. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం దాదాపు 1000 ఎకరాల భూమి కేటాయించింది. అధికారులు డీ వన్ పట్టాలతో సేత్వార్లు జారీ చేసి సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ కారణంగా సుమారు 1000 ఎకరాల భూమి అసైన్డ్ జాబితాలో చేరింది. దీంతో 312 రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కొనుగోళ్లు, అమ్మకాలు జరగడం […]

వర్షాకాల సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను సహా 8 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో 8 ముఖ్యమైన బిల్లులను కేంద్రం సభలలో ప్రవేశపెట్టనుంది. ఈ పార్లమెంట్ సమావేశాలలో భాగంగా కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేయనున్నారు. ఈ సమావేశంలో ట్యాక్స్ బిల్లుతో పాటు నేషనల్ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లు, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (ఖనిజాలు మరియు గనులు) సవరణ బిల్లు ఉన్నాయి.

గండికోటలో బాలిక మర్డర్ కేసులో ఊహించని మలుపు

గండికోటలో ఇంటర్ బాలిక హత్య కేసు మలుపులు తిరుగుతోంది. పరువు హత్యగా భావిస్తున్నారు. ప్రియుడు లోకేష్ ..బాలికను చంపలేదని పోలీసులు ఓ క్లారిటీకి వచ్చారు. అయితే ఆ యువకుడ్ని ఇరికించడానికి పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇది పరువు హత్యేనని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రియుడు లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్లింది. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువు గండికోటకు వెళ్లారు. వారే ఏదో చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON