loader

కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఆయనతో పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. పలు రాష్ట్ర సమస్యలను కేంద్రమంత్రికి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షా కు, కేంద్రానికి, ప్రధానికి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు […]

హిందీ భాషపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన పీవీ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన, భాషల ప్రాధాన్యతపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. “మనం హిందీ ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నలు కొందరిలో వినిపిస్తున్నాయి. కానీ, పీవీ నరసింహారావు గారు 17 భాషలు నేర్చుకున్నారు. ఆయన భాషలలో చేసిన సాధన వల్లే అంత గొప్ప వ్యక్తిగా ఎదిగారు” అని చంద్రబాబు చెప్పారు. హిందీ భాషను వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, అదే సమయంలో తెలుగును మరువకూడదన్న స్పష్టత ఉంది.

కోట్ల పెట్టుబడులకు 95 సంస్థలు ముందుకువచ్చాయి : లోకేశ్

ఏపీలో రాబోయే నాలుగేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు.

నదిలో పడిపోయిన జీపు.. ఎనిమిది మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌ పిథోర్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం. ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మృతులందరూ బోక్తాకు చెందినవారని తెలుస్తున్నది.

అట్టహాసంగా ముగిసిన బిమ్‌స్టెక్ పోర్ట్స్ కాన్‌క్లేవ్

విశాఖపట్నం సముద్రతీరంలో రెండు రోజులుగా సాగిన బిమ్‌స్టెక్ పోర్ట్స్ కాన్‌క్లేవ్ అట్టహాసంగా ముగిసింది. నోవోటెల్‌ హోటల్‌ వేదికగా ఈ కాన్‌క్లేవ్ రెండవ రోజు మరింత గణనీయంగా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంత అభివృద్ధి, నౌకాశ్రయాల సామర్థ్యం పెంపు, క్రూయిజ్ పర్యటనల విస్తరణ, మానవ వనరుల సద్వినియోగం వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా చర్చలు జరిగాయి. ప్రస్తుతం బిమ్‌స్టెక్ దేశాల మధ్య వాణిజ్యం కేవలం 7% మాత్రమే ఉండటం ఆందోళనకరం అని నిపుణులు అభిప్రాయపడ్డారు.

జగన్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన సరస్వతీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదలాయింపు పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో, ఎన్సీఎల్టీ తుది తీర్పును రిజర్వ్ చేసింది. జగన్ తరపు న్యాయవాది వాదనలో, తన అనుమతి లేకుండా కుటుంబ సభ్యులు సంస్థలో తన వాటాను బదలాయించారని పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల తరపు న్యాయవాదులు మాత్రం బదలాయింపు చట్టబద్ధంగానే జరిగిందని, ముందస్తు ఒప్పందం ప్రకారమే జరిగిందని […]

ఏటికొప్పాక బొమ్మలకి జాతీయ స్థాయిలో గుర్తింపు

ఏటి కొప్పాక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి జిల్లాలో గల ఒక చిన్న గ్రామం. ఇది లక్క బొమ్మలు తయారీలో దేశ వ్యాప్తంగా పేరు పొందింది. స్థానికంగా లభించే అంకుడు చెట్టు లక్కడి ను ఉపయోగించి తయారుచేసే ఈ బొమ్మలు హస్తకళా ప్రాముఖ్యత, స్వదేశీ నైపుణ్యం కలిగి ఉంటాయి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి ( ఓడీఓపీ)’ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక […]

ఒలింపిక్స్‌లో క్రికెట్.. 128 తర్వాత మళ్లీ పోటీలు..

2028 విశ్వక్రీడలు ఒలింపిక్స్ లాస్ ఎంజిల్స్‌లో జరుగనున్నాయి. ప్రతీ ఒక్కరు ఆసక్తికరంగా ఎదురుచూసే ఈ క్రీడల్లో ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. 2028 ఒలింపిక్స్‌లో క్రీడల్లో క్రికెట్ భాగం కానుంది. 128 ఏళ్ల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ టి-20 ఫార్మాట్‌లో జరుగుతుంది. పురుషులు, మహిళలు మొతం ఆరు అంతర్జ్యాతీయ జట్లు విశ్వ వేదకపై తలపడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది

విద్యార్థుల భోజనం ప‌ట్ల‌ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

న‌ల్ల‌గొండ జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గుర్రంపోడ్‌ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని, డైనింగ్‌, పాఠశాల ఆవరణలో పరిశ్రుభతను పరిశీలించారు. పదో తరగతి గదిలోకి వెళ్లి గ‌ణితంపై విద్యార్థుల సామ‌ర్ధ్యాన్ని ప‌రీక్షించారు

భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా బృందం

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీమ్ మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు తిరిగి భూమికి చేరుకుంది. స్పేస్ నుంచి సోమవారం డ్రాగన్‌ వ్యోమనౌకలో బయలుదేరిన ఈ బృందం.. 22 గంటలకుపైగా ప్రయాణించి కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో దిగింది. శుభాంశు టీమ్ క్షేమంగా భూమికి చేరుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON