loader

లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన టీమిండియా!

లార్డ్స్ టెస్టులో టీమిండియా పోరాడి ఓడింది. 193 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో భారత జట్టు 74.5 ఓవర్లు బ్యాటింగ్ చేసి 170 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 23 పరుగుల తేడాతో లార్డ్స్ టెస్టు గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సంపాదించింది. రెండో సెషన్ మొత్తం ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన భారత జట్టు, చివరి 2 వికెట్లకు 58 పరుగులు జోడించినా.. విజయాన్ని అందుకోలేకపోయింది..

ప్రాణాలు తీస్తేస్తున్న నిఫా వైరస్..ఇద్దరు మృతి, డేంజర్‌లో 550 మంది

కేరళను నిఫా వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో ప్రజలు భయపడుతున్నారు. పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి జులై 12న మృతి చెందాడు. బాధితునికి నిఫా వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు అంతకు ముందే మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నిఫా ఇన్ఫెక్షన్‌తో మరణించాడు. దీంతో వందలాది మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌పై నిఘా పెట్టాల్సి వచ్చింది. ఇది రాష్ట్ర ఆరోగ్య శాఖకు పెద్ద సవాల్‌గా మారింది.

దేశ నేర రాజధానిగా బీహార్..రాహుల్ గాంధీ

బీహార్ లో 11 రోజుల్లో 31 హత్యలు జరగడం.. అక్కడి శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ విమర్శించారు. ‘‘బీహార్.. దేశ నేర రాజధానిగా మారింది. రాష్ట్రంలోని ప్రతి గల్లీలో భయం, ప్రతి ఇంట్లో అశాంతి నెలకొంది. నిరుద్యోగ యువతను ‘గుండా రాజ్’ హంతకులుగా మారుస్తోంది. సీఎం తన సీటును కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారు. బీజేపీ మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఈసారి ఓటు ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బీహార్‌ను కాపాడటానికి అని ప్రజలు గుర్తుంచుకోవాలి’’ అని […]

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు నాగపూర్‌ నుంచి తిరుపతికి వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని జనగామ జిల్లా మీదుగా వెళ్తుండగా కారు గుంతలో పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని రక్షించారు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.

తెలంగాణ, ఎపి సిఎంలతో భేటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య గత కొంతకాలంగా జల వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సిఆర్ పాటిల్‌తో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ.. కేంద్ర జల్‌శక్తి శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు సిఎంలకు వీలు అవుతుందో, లేదో తెలపాలని పేర్కొంది.

అవకాశాల కోసం పరుగెత్తలేదు..అశోక్ గజపతి రాజు

గోవాకు గవర్నర్ గా నియమితులైన తర్వాత అశోక్ గజపతి రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించిన కూడా సమర్ఱవంతంగా నిర్వహించుకుంటూ వచ్చానన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు తనను గవర్నర్ గా సిఫారసు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహంలేదని, ఏనాడు అవకాశాలు కావాలని పరుగెత్తలేదన్నారు. తనకు ఏ బాధ్యత ఇచ్చిన సమర్థవంతంగా నిర్వర్తించి.. తానేంటో నిరూపించుకున్నట్లు చెప్పుకొచ్చారు.

పేదలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. 11.3 లక్షల మందికి లబ్ధి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పేదలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.‌ ‘‘ప్రస్తుతం 40 లక్షల ఇళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. మొత్తం 3 కోట్ల మందికి బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళలకు రూ.21 వేల కోట్ల రుణాలు ఇచ్చాం.ేశంలో వరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణను టాప్‌లో నిలిపాం,” అని సీఎం తెలిపారు.

ఇంటలిజెన్స్‌బ్యూరోలో 3,717 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ACIO (II) ఎగ్జిక్యూటివ్ నియామకానికి నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 3,717 పోస్టుల భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 19జులై 2025న ప్రారంభమవుతుంది. 10ఆగస్టు 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ mha.gov.inద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు లింక్ 19 జులై 2025 నుంచి యాక్టివ్ అవుతుంది.

కవిత త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతుంది: తీన్మార్ మల్లన్న

ప్రభుత్వ పెద్దలపై తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు. బిసి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే అండగా నిలవాల్సింది పోయి కవితకు మద్దతు తెలిపి తననే విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తుందని మల్లన్న ఆరోపించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ రాకంటే ముందే కవిత సంబరాలు చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆమెకు అండగా నిలవడం చూస్తుంటే […]

డ్రాగన్ క్రూ అన్‌డాకింగ్ సక్సెస్.. అంతరిక్షం భూమికి బయలుదేరిన శుభాన్షు శుక్లా

18 రోజులు పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా నలుగురు భూమికి తిరుగు పయనమయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్ఎస్ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రూ కాప్సూల్ విడిపోయింది. అనంతరం భూమి దిశగా పయనం ప్రారంభించింది. 22 గంటల ప్రయాణం అనంతరం ఈ స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం (జూలై 15) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియా తీరంలో దిగనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON