loader

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం – లారీ బోల్తా పడి ఏడుగురు మృతి

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, మరికొందరు కూలీలు గాయపడ్డారు.రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్ కు మామిడికాయల లోడుతో లారీ వెళ్తోంది. ఈ క్రమంలో రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 16 మంది వరకు మామిడికాయలు కోసే […]

అమరావతిలో రూ.2,200 కోట్లతో బిట్స్‌ క్యాంపస్ ఏర్పాటు.. అధికారికంగా ప్రకటించిన కేఎమ్‌ బిర్లా!

ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతిలో బిట్స్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. రూ.2వేల కోట్ల పెట్టుబడితో, డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్‌తో, ఏఐ, ఐఓటి ఇంటిగ్రేట్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. 7000 మంది విద్యార్ధులు చదువుకునే విధంగా ఈ క్యాంపస్ నిర్మిస్తామని ఆయన అన్నారు.

టీమిండియా ముందు ఊరించే టార్గెట్

లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 387 పరుగులకి ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు, 62.1 ఓవర్లలో 192 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియా గెలవడానికి 193 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరో నాలుగు సెషన్ల ఆట మిగిలి ఉండడంతో ఫలితం తేలడం ఖాయం.. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీయగా జస్ప్రిత్ బుమ్రాకి 2 వికెట్లు దక్కాయి.

ఈనెల 26న సింగపూర్‌కు చంద్రబాబు బృందం

అమరావతి రాజధాని నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు జరపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, నారా లోకేశ్‌, టీజీ భరత్, అధికారులు సింగపూర్‌ వెళ్లనున్నారు.

ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్ అదృశ్యం..సీరియస్‌గా తీసుకున్న సీఎం

ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న త్రిపుర విద్యార్థిని స్నేహా దేవ్‌నాథ్ జూలై 7న కనిపించకుండా పోయింది. ఆమె చివరిసారిగా తన తల్లికి ఫోన్ చేసి సరాయి రోహిల్లా రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నానని చెప్పింది. సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద ఆమెను క్యాబ్ డ్రైవర్ దింపినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా, ఆమె ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా, స్నేహ రాసిన సూసైడ్ నోట్ పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

డెకాయ్ ఆపరేషన్… డ్రగ్స్‌‌పై ఈగల్ టీమ్ పంజా…

హైదరాబాద్‌లో గంజాయి వినియోగంపై ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌లో 15 మంది గంజాయి వినియోదారులు దొరికిపోయారు. సందీప్ డ్రగ్స్ విక్రయించేందుకు వినియోగించే ‘‘భాయ్ బచ్చా ఆగయా భాయ్’’ కోడ్‌తో పోలీసులు డ్రగ్స్ వినియోగదారులకు పంపించారు. గచ్చిబౌలిలోని గంజాయి విక్రయించే ప్లేస్‌కు రావాలని వారికి చెప్పారు. ఆ ప్రాంతంలో మఫ్టీలో మోహరించిన ఈగల్ టీమ్… ఈ ఆపరేషన్‌లో మొత్తం 15 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గంజాయి కోసం వచ్చి పోలీసులకు చిక్కారు. ఇంతమంది కేవలం రెండు గంటల వ్యవధిలోనే […]

తీన్మార్‌ మల్లనపై డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, జాగృతి కార్యకర్తలపై దాడి చేయించి, కాల్పులు చేయించిన ఘటనపై ఆమె ఈ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మా జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన్ననా? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలి. దీని మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాను

ముగిసిన ‘కోట’ అంత్యక్రియలు

సినీ ప్రముఖులు, అభిమానులు, కళాకారులు, కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకు ముందు ఫిల్మ్‌నగర్‌లోని కోట శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఇందులో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు పాల్గొని కోటకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

అమరావతిలో భూమిలేని నిరుపేదలకు పింఛన్ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని భూమిలేని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో వారికి ఇచ్చే పెన్షన్ ను పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మిస్తున్న గ్రామాల్లోని 1575 కుటుంబాలకు పింఛన్ మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో రాజధాని ప్రాంతంలోని నిరుపేదలకు పెన్షన్ పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు.

మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా?: కవిత

ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండి అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై దారుణంగా మాట్లాడారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా? అని కవిత ప్రశ్నించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం అని హెచ్చరించారు. తనపై అసభ్యకర మాటలు మాట్లాడితే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. వెంటనే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON