loader

వింబుల్డన్ క్వీన్ స్వియాటెక్.. పొలాండ్ నుంచి తొలి ఛాంపియన్‌గా రికార్డు

వింబుల్డన్‌లో మరో కొత్త ఛాంపియన్. పొలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ ఈ మెగా టోర్నీలో విజేతగా అవతవరించింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అద్భుత విజయంతో టైటిల్‌ కైవసం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన రెండు సెట్లలో జోరు చూపించిన పొలాండ్ భామ అమెరికా సంచలనం అమందా అనిస్మోవాకు చెక్ పెట్టింది. మొత్తంగా ఆమెకిది ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇక తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అమెరికా ప్లేయర్ అమందా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

కర్నాటక గుహలో ఇద్దరు కూతుళ్లతో బతికేస్తున్న రష్యా మహిళ

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కుమత తాలూకులో రామతీర్థ కొండల్లోని ఒక గుహలో మనుషులు నివసిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. ఓ తల్లి, ఇద్దరు కూతుళ్లతో ఉండటం గమనించారు గుహలో జీవిస్తున్న మహిళ పేరు నీనా కుటినాగా పోలీసులు తెలుసుకున్నారు. ఆమె రష్యా నుండి భారతదేశానికి బిజినెస్ వీసాపై వచ్చింది, ఆ వీసా 2017 ఏప్రిల్‌లో గడువు ముగిసింది. ఆమె ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో అనధికారికంగా ఉంటోంది.

మెరిసిన సురేఖ, ప్రీతికా.. ఒకేరోజు భారత్‌కు రజతం, కాంస్యం

స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4 లో భారత మహిళా బృందం పతకాల వేట కొనసాగిస్తోంది. జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్, ప్రీతికా ప్రదీప్‌ లతో కూడిన త్రయం శనివారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో రజతం కొల్లగొట్టింది. పోడియం మీద మువ్వన్నెల జెండాను ఈ ముగ్గురు రెపరెపలాడించగా.. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురేఖ గురి అదరడంతో కాంస్యం కూడా వచ్చి చేరింది.

గుడివాడలో రప్పా రప్పా రాజకీయాలు

గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో వైసీపీ విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేసింది. ఏడాది పాలన అయిన సందర్భంగా టీడీపీ కూడా తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. మాజీమంత్రి కొడాలి నాని, సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు కూడా మోసం గ్యారంటీ ఫ్లెక్సీలు వేశారు. అయితే వాటిని టీడీపీ కార్యకర్తలు […]

రూ 99కే సిల్స్ చీర, రూ 49కే ఎగ్ బిర్యానీ- బిజినెస్ 2 కోట్లు

99 రూపాయలకే నాణ్యమైన సిల్క్‌ చీర, 49 రూపాయలకే ఎగ్‌ బిర్యానీ అంటూ బాపట్ల జిల్లా పర్చూరులో ఓ వ్యక్తి దుకాణం పెట్టాడు. తక్కువ ధరలకే ఇటు చీరలు, అటు బిర్యానీ లభిస్తుండటంతో జనం బాగానే రావడం మొదలుపెట్టారు… వ్యాపారం సూపర్‌ హిట్టయింది వ్యాపార కోసం పెట్టుబడి కావాలని, అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపాడు… అంతే ఒకరికి తెలియకుండా ఒకరు కోట్ల రూపాయల అప్పులు ఇచ్చేశారు అంతా 2 కోట్లు కాగానే రాత్రికి రాత్రి వెంకటేశ్వర్లు బిచాణా […]

మహంకాళీ బోనాలకు భారీ బందోబస్తు

ఉజ్జయిని మహంకాళీ బోనాలకు హైదరాబాద్ పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు 2,500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. విఐపిలు మహంకాళీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లపై సీఎం వారితో చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ,  తదితరులతో సీఎం తన ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు

ఏపీ విద్యార్థులకు నిధులు విడుదల

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గానూ  నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండో విడత కింద రూ.600 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. త్వరలోనే మూడో విడతలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి  తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందకపోవటంతో ఫీజుల కోసం కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి […]

గ‌గ‌న్‌యాన్‌కు చెందిన కీల‌క ప‌రీక్ష‌ విజ‌య‌వంతంగా పూర్తి

గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు చెందిన కీల‌క ప‌రీక్ష‌ను ఇస్రో(ISRO) విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. స‌ర్వీస్ మాడ్యూల్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌ను పూర్తిగా డెవ‌ల‌ప్ చేసిన ఇస్రో.. క్వాలిఫికేష‌న్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా స‌ర్వీస్ మాడ్యూల్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌ను స‌మ‌గ్రంగా ప‌రీక్షించింది. ఎస్ఎంపీఎస్‌కు చెందిన 350 సెక‌న్ల ఫుల్ డ్యూరేష‌న్ హాట్ టెస్ట్‌ను శుక్ర‌వారం పూర్తి చేశారు.హాట్ టెస్ట్ స‌మ‌యంలో ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్ ప‌ర్ఫార్మెన్స్ నార్మ‌ల్‌గా సాగింద‌ని ఇస్రో ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

కృష్ణానదిలోకి భర్తను తోసేసిన భార్య..

కర్ణాటక రాయచూర్ జిల్లా శక్తినగర్ చెందిన తాతప్ప, అతని భార్య ఇద్దరు మోటర్ బైక్ మీద.. తెలంగాణలోని నారయణ పేట జిల్లాకు వస్తున్నారు. కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జి వద్దకు రాగానే ఇద్దరం సెల్పీలు దిగుదామని భార్య ఒక్కసారిగా భర్తను గట్టిగా నదిలోకి తోసేసింది. అతను కొద్దిదూరం కొట్టుకుని పోయాడు. కొంత మంది సాయంతో బ్రిడ్జి మీదకు వచ్చాడు. ఆ తర్వాత తన భార్య తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆమెతో గొడవకు దిగాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON