loader

పన్ను ఎగవేతలు అడ్డుకోవడానికి టెక్నాలజీ ఉపయోగించండి : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పన్ను విధానాలు, జీఎస్టీ వసూళ్లపై కీలక చర్చలు జరిగాయి. సీఎం స్పష్టంగా పేర్కొన్న విషయం టెక్నాలజీ ఉపయోగించి పన్ను ఎగవేతలను అడ్డుకోవడం అవసరం.పన్ను ఎగవేతలు గుర్తించేందుకు డేటా అనలిటిక్స్ ఉపయోగపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ పరంగా దేశానికి ఆదర్శంగా నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ఆంధ్రా లిక్కర్ స్కాంలో నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి

ఏపీ లిక్కర్ కేసు లో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.32 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చింది. మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు.? ఎక్కడికి చేర్చారు.? ఎలా తరలించారు.? అనే కీలక అంశాలన్నింటినీ సిట్‌ అధికారులు ఇప్పటికే దర్యాప్తులో గుర్తించినట్లుగా చెబుతున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. త్వరలో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేయనుంది. ఈడీ కూడా ఇప్పటికే కేసులు నమోదు […]

అంతరిక్షంలో వ్యవసాయంపై ఇస్రో స్పెషల్‌ కోర్సు..

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌ కోసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. IN-SPACe, అకడమిక్‌ పార్ట్‌నర్స్‌తో కలిసి ‘ఎసెన్షియల్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్’ అనే షార్ట్‌టర్మ్‌ కోర్స్‌ని లాంచ్‌ చేసింది. 2025 జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో కోర్స్‌ అందిస్తారు స్పేస్‌ టెక్నాలజీ వ్యవసాయాన్ని ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.

ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాన్ని భూ ప్రకంపనలు వదలడం లేదు. శుక్రవారం సాయంత్రం మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.7గా నమోదు అయింది. భూకంప కేంద్రం హర్యానా ప్రాంతంలో ఉన్నట్లుగా గా గుర్తించారు. ఈ భూకంపం స్వల్ప తీవ్రత కలిగి ఉన్నప్పటికీ, ప్రకంపనలు స్పష్టంగా గమనించేలా ఉన్నాయని పలువురు సోషల్ మీడియాలో స్పందించారు. గురుగ్రామ్, నోయిడా, ఢిల్లీలోని హై-రైజ్ భవనాలలో నివసించే వారు బలమైన ప్రకంపనలకు భయపడ్డారు.

ఫరీద్‌పేటలో వైసీపీ నేత దారుణ హత్య: ఏడాదిలో రెండో హత్య

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటలో పట్టపగలు సత్తారు గోపి(46)అనే వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో ప్రత్యర్ధులు నరికి చంపారు. వైసీపీ నేత,ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రధాన అనుచరుడిగా గోపి ఉన్నారు. సరిగ్గా ఏడాది కిందట గోపి డ్రైవర్ కూన ప్రసాద్ ను గ్రామంలోనే ప్రత్యర్థులు హత్య చేశారు. ఇప్పుడు సత్తారు గోపీనే హత్య చేశారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిసీలించారు. పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయి అంటూ ఎస్పీనీ […]

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 14 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. బస్తర్ డివిజన్‌లో భద్రతా దళాల నిరంతర ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంవల్ల ప్రభావితమై పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. వీరిలో కుతుల్‌ ఏరియా కమిటీ కమాండర్‌ సుఖ్‌లాల్‌ కూడా ఉన్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. లొంగిపోయిన 22 మంది మావోయిస్టులపై మొత్తం రూ.37 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

లార్డ్స్ లో రూట్ సెంచరీ… బుమ్రాకు 4 వికెట్లు

మూడవ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. లార్డ్స్ మైదానంలో లంచ్ సమయానికి ఆతిథ్య జట్టు 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. జో రూట్(104) అద్భుత సెంచరీతో మెరిశాడు. అయితే భారత్ బౌలింగ్ అంచనాలకు తగ్గట్టే సాగింది.సెంచరీ చేసిన వెంటనే జో రూట్ బూమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వెంటనే మరో బంతికి క్రిస్ వోక్స్ (0)ను పెవిలియన్ పంపి ఇంగ్లండ్‌ను బూమ్రా కష్టాల్లో పడేశాడు.

మెడికోలపై లైంగిక వే ధింపుల ఘటనలో ముగ్గురు అరెస్ట్

కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న విద్యార్థినీలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల నుంచి ఈ వేధింపులు జరుగుతున్నప్పటికీ ఎనిమిదవ తేదీన తమకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు అందిందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. నలుగురు ఆరోపిత సిబ్బంది వి. కళ్యాణ్ చక్రవర్తి, ఎస్. గోపాలకృష్ణ, బి. జిమ్మీ రాజు, కె.వి.వి.ఎస్. ప్రసాద రావు సస్పెండ్ చేస్తూ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ […]

టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ మర్డర్ కేసులో ట్విస్ట్

జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి. కేవలం 25 సంవత్సరాల వయసులో ఆమె జీవితాన్ని కన్నతండ్రే ముగించాడు. రాధిక యాదవ్ హత్యపై దర్యాప్తులో ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది అదే రాధిక తండ్రిని రెచ్చగొట్టిన వీడియో. సోషల్ మీడియా నుండి వీడియోను తొలగించమని తన కుమార్తెను పదేపదే అభ్యర్థించినప్పటికీ రాధిక వినలేదు. రాధిక తన సొంత టెన్నిస్ అకాడమీని స్థాపించినప్పుడు. తన కుమార్తె డబ్బుతో తాను తింటున్నానని తన గ్రామమైన వజీరాబాద్‌లోని ప్రజలు తనను ఆటపట్టించారని దీపక్ […]

తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీలకు హైకోర్టు షాక్..

తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఫీజులు పెంచాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఫీజుల పెంపు విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC)ను ఆదేశించింది. 6 వారాల్లోగా ఈ వ్యవహారంపై కమిటీ స్పష్టత ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు అమలవుతుందని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON