కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి
సాగునీటి ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చిద్దామని తాను సూచన చేశానని, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చించుకుందామని కోరినప్పటికీ, కేసీఆర్ సడన్ గా వచ్చి ఏదేదో మాట్లాడారని సీఎం అన్నారు. అధికారం కోల్పోయి, డిపాజిట్లు కూడా కోల్పోయి, అభ్యర్థులు దొరకక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న కొందరు విచిత్రమైన వాదనలు చేస్తున్నారని, ఏడాదిలోనే సర్వం నాశనమైందని.. మళ్లీ వాళ్లు వస్తేనే బాగుపడుతుందన్నట్టు వితండవాదన తీసుకొస్తున్నారని ఆయన పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.