యూరియా కోటాను పెంచండి.. నడ్డాకు సిఎం రేవంత్ వినతి
దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా కోటాను పెంచండి.. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయండి కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మనతెలంగాణ/హైదరాబాద్ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జెపి నడ్డాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కలిశారు.

