ప్రశాంతంగా బిబికా ఆలం ఊరేగింపు
మొహర్రం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఊరేగింపులు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీబీ కా ఆలం భారీ ఊరేగింపు దబీర్‌పురా(దారుల్ షిఫా)లోని ఆషుర్‌ఖానా నుండి ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకువచ్చిన లక్ష్మి ఏనుగుపై ‘ఆలం‘ను ఉంచి ఈ యాత్ర కొనసాగింది. అనంతరం ఊరేగింపు మూసీ నది ఒడ్డున ఉన్న మసీద్ -ఎ- ఇలాహీ, చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది.