loader

భూములకు కొత్త పాసుబుక్‌లు…ఉచితంగానే

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భూముల రీ సర్వే నిర్వహిస్తుందని ఎవరికి అన్యాయం జరగకుండా, హక్కులకు భంగం లేకుండా పారదర్శకంగా భూ సర్వే జరుగుతుందని తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు 15న పంపిణీ చేయనున్నట్టుగా తెలిపారు. వీటిని ఉచితంగానే రైతులకు అందజేస్తామని చెప్పారు. వివిధ రకాల భూములకు వేర్వేరు రంగులతో కూడిన పాస్‌బుక్‌లు అందజేయనున్నట్టుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. భూములకు ఆధార్‌, సర్వే నంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

సంచనలంగా మారిన ఏక్‌నాథ్‌ షిండే జై గుజరాత్‌ నినాదం

MNS కార్యకర్తలు దుకాణదారుడిపై దాడి చేసిన వివాదం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం తన ప్రసంగాన్ని “జై హింద్, జై మహారాష్ట్ర, జై గుజరాత్” ఈ నినాదంతో ముగించారు. షిండే చేసిన జై గుజరాత్‌ నినాదంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు చెందినవారు కాబట్టి షిండే ఈ నినాదం పలికారని, ఆయనకు “అధికార దాహం” ఉందనంటూ ఎన్‌సిపి (ఎస్పీ) నాయకుడు క్లైడ్ క్రాస్టో […]

సత్యసాయిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 17 బాలికలు అస్వస్థత

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలిక‌ల హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజన్ క‌ల‌క‌లం రేపింది. కలుషిత ఆహారం తిని 17 మందికి అస్వస్థత గురయ్యారు. విద్యార్థులకు వాంతులు విరేచనాలు రావడంతో.. వెంటనే గుట్టుచ‌ప్పుడు కాకుండా వసతి గృహంలోనే వైద్య చికిత్స అందించారు. అంతేకాదు పిల్లల ఏమయ్యిందో కనీసం వారి తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వలేదు.. తల్లిదండ్రులను పిల్లలతో కలవనీయకపోవడంతో.. ఏమయ్యిందో తెలియక అయోమయానికి గురయ్యారు.

ఆసియా ప‌వ‌ర్‌లిఫ్టింగ్ చాంపియ‌న్‌షిప్‌లో బంగారు ప‌త‌కం

కిర్గిజ్‌స్తాన్ వేదిక‌గా జ‌రిగిన ప్ర‌తిష్టాత్మ‌క WPC ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో మాస్ట‌ర్ దీటి మ‌నోజ్ కుమార్ బంగారం ప‌త‌కం గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మనోజ్ కుమార్ అసాధారణమైన ప్ర‌తిభ‌ను, సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ గెలుపు దేశానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మ‌నోజ్ అద్భుతమైన విజయం భారతదేశానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా గ‌ర్వ‌కార‌ణం.

వైసీపీ నేతపై టీడీపీ దాడి: జగన్ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామపంచాయతీ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా ప్రత్యర్థులు దాడి చేశారు. టీడీపీ నేతలే హత్యాయత్నం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రెడ్‌ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఉండే మోడీ రండీ తేల్చుకుందాం..రేవంత్

తెలంగాణలో రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరు ఎంత చేశారో తేల్చుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలను బహిరంగ చర్చకు ఆహ్వానించారు. “ కేడీ గల్లీలో ఉన్నా, మోడీ ఢిల్లీలో ఉన్నా… రైతు సమస్యలపై ముఖాముఖీకి రావాలండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేవలం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం తమ ప్రభుత్వ విజయాన్ని చూపుతున్నదని సీఎం స్పష్టం చేశారు.

లెక్క తక్కువైతే క్షమాపణలకు రెడీ: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. ఈ లెక్కల్లో ఏమైనా తేడా ఉంటే.. నేను క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధం అని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.

నేషనల్ మెడికల్ కమిషన్‌లో.. భారీ స్కాం బట్టబయలు

దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీలను తనిఖీ చేయాల్సిన నేషనల్ మెడికల్ కమిషన్‌లో భారీ స్కాం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దేశవ్యాప్తంగా 36 మంది వైద్యులు, పలు మెడికల్ కాలేజీలపై CBI కేసు నమోదు చేసింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు వైద్యులు సైతం ఉండటం విశేషం. ఇన్స్పెక్షన్ బృందంలోని సభ్యులు మెడికల్ కాలేజీలకు వెళ్లే ముందే ఏ కాలేజీ కి వెళ్తున్నామో వారికి ముందస్తు సమాచారం ఇచ్చి వారి నుండి ఏకంగా […]

తెలంగాణలో 13 పార్టీలకు ఈసీ షాక్

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా […]

సైదాబాద్ ఎస్ఐపై డీసీపీకి ఫిర్యాదు చేసిన గిరిజ‌న సంఘాల నేత‌లు

ిరిజన సంఘం మహిళా నాయకురాలి పట్ల అనుచితంగా వ్యవహరించిన సైదాబాద్ ఎస్ఐ సాయిక్రిష్ణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన మహిళా నాయకురాలు పట్ల ఎస్ఐ సాయి కృష్ణ వ్యవహరించిన తీరుపై సమగ్రంగా విచారణ జరిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON