జడ్జిపై ట్రోల్స్.. ధర్మాసనంపై ఏపీ హైకోర్టు జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో తీర్పు విషయమై సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఆయన స్పందించారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని జస్టిస్ అన్నారు. ‘‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్’ అని ఆయన వ్యాఖ్యానించారు.

