loader

టెన్త్ పాసైన ప్రతీ విద్యార్థి ఇంటర్ చదవాల్సిందే: సీఎం రేవంత్

రాష్ట్రంలో ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన ప్రతీ ఒక్క విద్యార్థి త‌ప్పనిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆ విధంగా అవకాశాలు కల్పించి అమలు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇత‌ర రాష్ట్రాల్లో 9వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉంటుంది. అందువల్ల ఆ రాష్ట్రాల్లో డ్రాపౌట్స్ సంఖ్య త‌క్కువ‌గా ఉంది,ఈ విధానంపై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాలి” అని సీఎం […]

ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ నేతల కన్ను: కెటిఆర్

బకాసురుడితో పోటీ పడుతూ తెలంగాణ భూముల్ని కాంగ్రెస్ నేతలు బుక్కపడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను కాంగ్రెస్ నేతలు బలవంతంగా తమ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని విమర్శించారు. బహిరంగ మార్కెట్లో చదరపు గజం రూ.30 వేలు ఉంటే కాంగ్రెస్ నేతలు రైతులను బెదిరించి రూ.4- 5 వేలకే కొంటున్నారని తెలిపారు.

టీచర్ల సలహాలతోనే పాఠశాలల్లో సంస్కరణలు- నారా లోకేష్

ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తి పట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించారు.

కాలేజీ బుక్‌లో మలయాళ స్టార్ మమ్ముట్టి స్టోరీ

మమ్ముట్టి సేవలను గౌరవిస్తూ కేరళలోని మహారాజ్ కాలేజీ బీఏ హిస్టరీలోని ఆయన కెరీర్‌పై పాఠ్యాంశాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ‘సెన్సింగ్ సెల్యులాయిడ్: హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా’ పేరుతో ఓ చాప్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మమ్ముట్టి జీవితం, సినీ కెరీర్, సినిమాపై అతని ప్రభావం గురించి బీఏ హిస్టరీ విద్యార్థులు తెలుసుకుంటారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే… మమ్ముట్టి కూడా ఈ కాలేజీ విద్యార్థే.

కుప్పానికి వరాలు కురిపించిన సీఎం చంద్రబాబు!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తన నియోజకవర్గం కుప్పంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించారు. ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమంలో భాగంగా సీఎం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ప్రారంభించారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చా. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తాం అని సీఎం వెల్లడించారు.

జగన్‌ను కలిసిన సింగయ్య భార్య-లోకేష్‌ మనషులపై ఆరోపణలు- ఈ డ్రామాలేంటని చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం కలిసింది. సింగయ్య భార్య లూర్దూమేరీ తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రకటించారు. సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నారు. అప్పటివరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్ గా ఎలా చనిపోతాడని ఆమె ప్రశ్నించారు. మనుషుల్ని చంపేసి .. డ్రామాలాడుతున్నారని సింగయ్య భార్యను పిలిపించుకుని అలా చెప్పించారని సీఎం చంద్రబాబు […]

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్స్ బంద్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్స్‌ను ఒకరోజు మూసివేస్తున్నట్టు ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతున్నప్పటికీ కొందరు అధికారుల తీరు సరిగా లేదని స్కూల్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖాస్త్రం సంధించారు. తమ బాధలు చెప్పుకొంటూ గురువారం స్కూల్స్ మూసి వేసి నిరసన తెలియజేస్తున్నట్టు వెల్లడించాయి.

బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు 6 నెలల జైలు శిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) బిగ్ షాకిచ్చింది. కోర్టు ధిక్కార కేసులో షేక్ హసీనాకు బుధవారం ఐసిటి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దాదాపు ఏడాది క్రితం బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటున్న హసీనాను దోషిగా నిర్ధారించింది. 2024 జూన్, జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై క్రూరంగా అణచివేసిన ఘటనలో హసీనా పాత్ర ఉందని అభియోగం […]

ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోవాష్‌రూమ్‌లో మహిళా ఉద్యోగుల వీడియోల చిత్రీకరణ

బెంగళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి ఆఫీసులోని రెస్ట్‌రూమ్‌లో మహిళా సహోద్యోగుల అశ్లీల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశాడు. ఓ మహిళా ఉద్యోగి…రెస్ట్‌ రూమ్‌లో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న తలుపు వద్ద ప్రతిబింబం గమనించింది. ఎవరో తనను వీడియో రికార్డు చేస్తున్నట్టుగా అనుమానించింది. నిందితుడి ఫోన్‌లో పలువురు మహిళలకు చెందిన 30కి పైగా వీడియోలను గుర్తించారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వప్నిల్ నగేష్ మాలి‌గా గుర్తించారు.

ఏపీ యువ ఐపీఎస్ అధికారి రాజీనామా- సంచలన లేఖ !

ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేయడంతో ప్రభుత్వ వేధింపుల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. దీంతో సిద్దర్థ కౌశల్ ఓ లేఖ విడుదల చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనే తన నిర్ణయం వ్యక్తిగత కారణాలు, అలాగే కుటుంబ ప్రాధాన్యతల కారణంగా వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాననిప్రకటించారు. వేధింపులు లేదా ఇతర బలవంతం కారణంగా తన రాజీనామా జరిగిందనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు, అలాంటి వాదనలను “నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి” […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON