బాబ్లీ గేట్లు ఎత్తివేత
దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి మంగళవారం నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 1,064 అడుగుల వద్ద 15,567 టిఎంసిల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో ఎస్‌ఆర్‌ఎస్‌పిలో నీరు చేరనుంది. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో నిజామాబాద్ జిల్లా, కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి గలగలా పారుతూ పరవళ్ళు తొక్కుతోంది.