loader

కేంద్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న ఆరు కీలక నిర్ణయాలు

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు రైల్వే ప్రాజెక్ట్‌లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సహకార రంగానికి NCDCకి కు రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ దేశవ్యాప్తంగా 100 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూపీ లోని ఇటార్సీ నుంచి నాగ్‌పూర్‌ వరకు కొత్త హైవే నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శంభాజీ నగర్‌-పర్బనీ మధ్య రైల్వే డబ్లింగ్‌ పనులకు […]

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై మంత్రి సోదరుడు దాడి..

డ్యూటీలో పోలీస్ కానిస్టేబుల్‌పై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోదరుడు దాడికి పాల్పడ్డారు. బనగానపల్లెలో లక్ష్మీ నరసింహ ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన.. తనను కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఆగ్రహించారు. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి.. సహనం కోల్పోయారు. అతడి చెంప చెల్లుమనిపించారు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఈ వివాదంపై మంత్రి జనార్ధన్ రెడ్డి స్పందించారు జరిగిన వివాదంపై చింతిస్తున్నాను. దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ నమోదుచేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ […]

సింగపూర్‌ పర్యటన విజయవంతం.. ఏపీకి రూ.45 వేల కోట్ల పెట్టుబడులు

మంత్రి నారా లోకేష్ గురువారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగపూర్‌ పర్యటన సక్సెస్ అయిందని, మొత్తం రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. అందరిలా “మేము ఎంవోయూలు కుదుర్చుకోవడం లేదు. ఒప్పందాల్ని నేరుగా అమలు చేసే దశకు తీసుకొస్తున్నాం,” అని లోకేశ్‌ అన్నారు. పెట్టుబడుల కోసం జూమ్‌కాల్‌ ద్వారా ఆర్సెలర్‌ మిత్తల్‌ను స్వయంగా ఆహ్వానించామని చెప్పారు.

అది మోదీకి తప్ప అందరికీ తెలుసు.. రాహుల్ సంచలన కామెంట్స్

భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తూ అమెరికా ప్రెసిడెంట్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇండియా ఆర్థికవ్యవస్థ చచ్చిపోయిందని ఆరోపించారు. ట్రంప్ అన్నది కరెక్టేనని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్.. రష్యాతో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నా నాకు అవసరం లేదు. ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మొత్తం కూల్చేసుకున్నా నాకు పట్టింపు లేదని ట్రంప్ అన్నారు. ఈ విషయం ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు తప్ప ప్రపంచంలోని అందరికీ తెలుసన్నారు. ట్రంప్ ఈ […]

కాళేశ్వరం కట్టినప్పుడు అనుమతులు ఉన్నాయా- నారా లోకేష్

బనకచర్ల అంశంపై తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు.. దాన్నో రాజకీయ అంశంగా చేసుకుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. దిగువ రాష్ట్రం.. సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే ఎగువ రాష్ట్రానికి ఎలా నష్టం జరుగుతుందని ప్రశ్నించారు.

స్టాలిన్‌తో మార్నింగ్ వాక్.. కాసేపటికే ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓపీఎస్.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో మార్నింగ్ వాక్‌ సందర్భంగా సమావేశమైన కొద్ది గంటల్లోనే పన్నీర్ సెల్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక మలుపు.. తొలి ఆధారంగా బయటపడ్డ అవశేషాలు

ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన తవ్వకాల్లో బుధవారం రోజు మనిషికి చెందిన అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. ఇది ఈ కేసులో తొలి ఆధారంగా నిలిచే శారీరక సాక్ష్యంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు చోట్ల తవ్వకాలు జరిపినా ఎటువంటి మానవ అవశేషాలు బయటపడలేదు. కానీ ఆరో స్థలంలో రెండో రోజు తవ్వకాల్లో మానవ అస్థిపంజరం భాగాలు లభ్యమయ్యాయి. SIT వర్గాల సమాచారం మేరకు అవి మనిషికి చెందినవే అని భావిస్తున్నారు.

ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబుకు భయమెందుకు ? : వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. తన పర్యటనకు వేలాదిమంది పోలీసులను మోహరించి తన అభిమానులను అడ్డుకోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందని సూపర్‌సిక్స్‌ హామీల గురించి ప్రశ్నించే గొంతులను నొక్కెస్తున్నారని దుయ్యబట్టారు.

పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రత్యేకంగా ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయానికి గడువు నిర్ణయించడంతో, ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యం కానున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఐదో టెస్ట్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఓవెల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (Ind VS Eng) మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలిచి తీరాలి. జరిగిన నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్ 2 మ్యాచుల్లో, భారత్ 1 మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సిరీస్ డ్రా అవుతుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే.. సిరీస్ సొంతం చేసుకుంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON