రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం, సామ్యవాదం తీసేయాలన్న దత్తాత్రేయ- మండిపడ్డ రాహుల్ గాంధీ
రాజ్యాంగం నుంచి లౌకిక, సోషలిస్ట్ అనే పదాలను తొలగించడం గురించి ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబాలే ఒక ప్రకటన చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగు మళ్ళీ తొలగిపోయిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని లాక్కోవడమే వారి నిజమైన ఎజెండా. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజ్యాంగం వద్దు, వారికి మనుస్మృతి కావాలి. బహుజనులు,పేదల హక్కులను లాక్కోవడం ద్వారా వారిని మళ్ళీ బానిసలుగా చేయాలనుకుంటున్నారు” అని ఆయన అన్నారు.