ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన శుభాంశు.. తొలి భారతీయుడిగా రికార్డు
ISRO(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) వ్యోమగామి శుభాంశు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. భారత అంతరిక్ష చరిత్రలో గర్వించదగ్గ మైలురాయిని నమోదు చేశాడు. ఐఎస్‌ఎస్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలిచాడు. వీరు ప్రయాణించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఇవాళ సాయంత్రం 4.03 గంటలకు ISSతో విజయవంతంగా డాక్ చేసింది.