loader

IISER IAT 2025 ఫలితాలు విడుదల

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , IISER ఆప్టిట్యూడ్ టెస్ట్ (IAT) 2025 ఫలితాలు ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ iiseradmission.inలో పూర్తి వివరాలు ఉంచారు. అందులోకి లాగిన్ అయిన తర్వాత స్కోర్ కార్డులు పొందవచ్చు IISER కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించి కూడా అభ్యర్థులకు తెలియజేసింది. IISER అకడమిక్ ప్రోగ్రామ్ ప్రిఫరెన్స్ ఫారమ్‌ పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ విండో జూన్ 26 నుంచి జులై 3 వరకు ఓపెన్ చేసి […]

ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు…

ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం..దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే ప్రాంతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని దీనితో పాటుగా మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంచు విష్ణు కార్యాలయంలో జిఎస్టి అధికారుల సోదాలు

మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో జిఎస్టి అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. లెక్క ప్రకారం జిఎస్టి కట్టారా? లేదా? అనే విషయంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

అడవి మార్గాన డోలీతో ఆరు కిలోమీటర్లు నడక

రహదారులు సరిగా లేక వలస ఆదివాసీలు దుర్భర జీవితాలు గడపాల్సి వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసి గ్రామమైన నీలాద్రిపేటకు చెందిన మడవి మంగమ్మకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆరోగ్యం విషమించింది. నీలాద్రిపేటకు రహదారి సరిగా లేకపోవడంతో జట్టి (డోలి) కట్టి అడవి మార్గాన సుమారు 6 కిలోమీటర్లు కాలిబాటన వచ్చి మోతె సమీపంలో 108 వాహనంలో ఎక్కించుకొని మణుగూరు ఏరియా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.

అక్ర‌మ కేసులు పెట్టిన వారే.. నాకు సెల్యూట్ కొట్టారు…

మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ సమన్వయ సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు మనపై బాధ్యత పెట్టారని, కష్టపడి ప్రజాసమస్యలు పరిష్కరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. ఇక్కడ ఎప్పుడైతే గెలిచామో అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించాం. నేను ఈ రోజు మచిలీపట్నం వస్తుంటే అడుగడుగునా పోలీసులు ఉన్నారు. మనపై అక్రమ కేసులు పెట్టిన వారే మనకు సెల్యూట్ కొట్టారంటే అదీ ప్రజాస్వామ్య […]

కో-లివింగ్‌ హాస్టల్స్‌తో అనర్థం : వీహెచ్‌

హైదరాబాద్ హైటెక్ సిటీలో విస్తరిస్తున్న కో-లివింగ్ (సహజీవన) హాస్టల్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో విస్తరిస్తున్న ఒకే హాస్టల్‌లో యువతీ యువకులు కలిసి ఉండటం సమాజంలో అనైతిక ప్రవర్తనకు, ప్రమాదకరమైన చర్యలకు దారితీస్తోందని హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలంటే.. ఇటువంటి ధోరణులను కట్టడి చేయాలని ఇటువంటి వసతి సౌకర్యాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును నియంత్రణ చర్యలు చేపట్టాలని […]

బటన్లు నొక్కి చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు చెప్పండి- పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై ఐదు వారాల ప్రచార ఉద్యమం ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. “రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో” పేరుతో క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేయాలని జగన్ సూచించారు.

CBSE ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్

CBSE కీలక నిర్ణయం తీసుకుంది కొత్త జాతీయ విద్యావిధానం2020లో సిఫార్సుల ప్రకారం ఇకపై టెన్త్ క్లాస్‌కి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే ఈ విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. ఫిబ్రవరిలో తొలి దశ పరీక్షలు, రెండోదశ బోర్డు పరీక్షలు మే నెలలో జరుగుతాయని మొదటిసారి నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుందని, రెండవసారి జరిగే పరీక్షలు ఆప్షనల్ అని తెలిపింది.

శుభాంశు శుక్లా… స్పేస్ నుంచి ఇండియన్స్‌కు మెసేజ్‌

‘‘నమస్కారం… నా ప్రియమైన దేశస్థులారా… ఇది ఎంతో గొప్ప ప్రయాణం. 41 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ అంతరిక్షంలోకి చేరుకున్నాం. ఇది అద్భుతమైన ప్రయాణం. మేము సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ  తిరుగుతున్నాము. నా భుజాలపై ఉన్న మన తిరంగ పతాకం… మీరంతా నాతో ఉన్నారని చెబుతోంది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేస్తున్న నా ప్రయాణం మాత్రమే కాదు. భారతదేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమానికి ప్రారంభం.మీరందరూ ఈ ప్రయాణంలో భాగం కావాలని […]

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఫేజ్‌-1 వివరాలు

తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2025) సీట్ల కేటాయింపు తొలి దశ ప్రక్రియ పూర్తి అయింది. ఫలితాలను ఈరోజు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫేజ్ 1 కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్‌సైట్ tsecet.nic.inలో ఉంచింది. అభ్యర్థులు జూన్ 29 లోపు అడ్మిషన్ ఫీ చెల్లించాలి. అడ్మిషన్‌ను నిర్ధారించడానికి అభ్యర్థులు ఆన్‌లైన్ స్వీయ-రిపోర్టింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకుంటే కేటాయించిన సీటు రద్దు చేస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON