loader

SBI PO Recruitment నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఎస్బీఐ శుభవార్త చెప్పింది. 541 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పరీక్షకు అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆసక్తిగలవారు జూలై 14, 2025 వరకు అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in) ద్వారా అప్లై చేసుకోండి. మొత్తం 541 ఖాళీలు ఉన్నాయి ఉండగా.. ఇందులో 500 రెగ్యులర్, 41 బ్యాక్‌లాగ్ ఖాళీలకు ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల […]

వైఎస్ జగన్‌‌కు పోలీసుల నోటీసులు… ఆ వాహనం సీజ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సింగయ్య మృతి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసులో ఏ2గా ఉన్న వైఎస్ జగన్‌కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు… అక్కడ పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసు అందజేశారు. అలాగే సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా… ప్రమాదానికి కారణమైనట్టుగా చెబుతున్న వాహనాన్ని కూడా […]

ఇరాన్‌పై దాడి వీడియోలు రిలీజ్ చేసిన పెంటగాన్

ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో అమెరికా సైన్యం ఇరాన్‌లోని మూడు కీలక న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్ , నటాంజ్ , ఇస్ఫహాన్ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌లు బాంబుల వర్షం కురిపించాయి. పెంటగాన్ జూన్ 24, 2025న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అధికారిక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది, ఇందులో B-2 బాంబర్‌లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి బయలుదేరడం, దాడి అనంతరం తిరిగి వచ్చే దృశ్యాలు ఉన్నాయి.

ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల..

ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు(AP PGECET) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి (Eamcet, Mpharmacy, PharmaD) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీఈసెట్‌ నిర్వహించగా.. నేడు ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ తన ఎక్స్‌ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీకి సంబంధించి 13 సబ్జెక్టుల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 93.55 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా 14,231 మంది ఈ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోగా..1,244 మంది అర్హత సాధించారన్నారు.

అమరావతికి మరో 44వేల ఎకరాల భూసమీకరణ

అమరావతి రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం అయింది. రాజధాని రెండో విడత భూసేకరణను ఆమోదించింది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని.. వరద జలాలను మనం వాడుకుంటామని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని సూచించారు.

టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయికి ఏపీ ప్రభుత్వం బంపరాఫర్

టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. డిప్యూటీ కలెక్టర్‌గా నియమించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాకేత్ సాయి మైనేని 2014లో సియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని మరియు పురుషుల డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించారు., 2016 మరియు 2019 సంవత్సరాల్లో జరిగిన ఆసియా క్రీడల్లో 2 స్వర్ణ పతకాలు మరియు 2 రజత పతకాలను సాధించారు. 2017లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే.

రైతు రుణ మాఫీ కోసం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేశాడు..సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి కేవలం 18 నెలల్లోనే రైతుల కోసం 4 వేల కోట్లు ఖర్చు చేశాం. రుణ మాఫీ, వరికి బోనస్, రైతు భరోసా అంటూ రైతులకి అండగా నిలిచాం. కేసీఆర్ మాత్రం అప్పులు, స్కాంలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని, మిగులు రాష్ట్రానికి ఏకంగా 8 లక్షల కోట్లు అప్పు చేసి మా నెత్తిపై వేశారు. రైతు రుణ మాఫీ కోసం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేశాడని తీవ్ర ఆరోపణలు […]

శత్రువుల మాటలపై మాకు నమ్మకం లేదు..టెహ్రాన్‌

12 రోజులుగా ఆయుధాలతో యుద్ధం చేసుకున్న ఇజ్రాయెల్-ఇరాన్‌..ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణను ఇరాన్‌ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. తమపై క్షిపణులతో దాడులకు దిగిందని టెల్‌అవీవ్‌ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్‌పై తాము ఎలాంటి దాడులూ చేయలేదని ఇరాన్‌ సైనికాధికారులు వెల్లడించారు. శత్రువుల మాటలపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తమ చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని వెల్లడించారు.

రిషభ్ పంత్‌పై ICC ఆగ్రహం

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు వార్నింగ్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.రిషభ్ పంత్ ఫీల్డ్ అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బంతి ఆకారం దెబ్బతిన్నదని, మార్చాలని రిషభ్ పంత్ అంపైర్‌ను కోరాడు. బాల్ గేజ్ సాయంతో పరిశీలించిన అంపైర్, బంతిని మార్చేందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రహానికి గురైన పంత్, అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ బంతిని నేలకేసి కొట్టాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు

మాజీ సీఎం జగన్ పై మరో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై తాజాగా మరో పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చి యార్డులో ఆయన నిర్వహించిన పర్యటనను ప్రస్తావిస్తూ నమోదు చేయబడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ పర్యటన జరిగిందని, కోడ్‌ను ఉల్లంఘించారని పోలీసులు అభిప్రాయపడ్డారు. వైసీపీ నేత‌లు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా యార్డుకు వచ్చి హడావుడి చేశారని ఆరోపణలున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON