loader

ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు- చంద్రబాబు

అన్నీ చేసేశామని చెప్పట్లేదని.. ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అమలు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. “సుపరిపాలనలో తొలి అడుగు” పేరిట ఏడాది పాలనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్‌- 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామన్నారు. మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటామన్నారు.

మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం – పవన్ కల్యాణ్ హెచ్చరిక

కూటమి ఐక్యత చెడకొట్టే పరిస్థితి లో నేను లేను.. 15 నుంచి 20 ఏళ్ళు ఉండే కూటమి ఇది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు, రావట్లేదు.గొంతులు కొసేస్తాం అని పిచ్చి బెదిరింపులు చేస్తే మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం. అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నేను కూడా సినిమాల్లో నుండి వచ్చిన వాడినేనని గుర్తు చేశారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఇక్కడ సరదాగా ఎవరూ లేరన్నారు

సింగయ్య మృతి పై స్పందించిన జగన్

తన పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని, కార్యకర్తలు తనను కలవకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారని ప్రశ్నించారు. “జనం ఎక్కువగా ఉన్నప్పుడు, జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం,మీ ప్రభుత్వ డ్రైవర్ నడుపుతున్న వాహనానికి చుట్టూ రోప్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదా? ఒకవేళ భద్రత కల్పించి ఉంటే, వాహనం కింద మనుషులు ఎలా పడగలుగుతారు? మీరు భద్రత కల్పించలేదన్నది నిజమా, లేక వాహనం కింద ఎవరూ పడలేదన్నది నిజమా?” అని ఆయన నిలదీశారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన జీహెచ్ఎంసీ ఏఈ

జీహెచ్‌ఎంసీలో అసిస్టెంట్ ఇంజినీర్ మనీషా ఆ బిల్లులను మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసింది. మరో రూ.15,000 ఇవ్వాలని మనీషా డిమాండ్ చేయడంతో ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. లంచం తీసుకుంటున్న సమయంలోనే మనీషాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మనీషాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

గుజరాత్, పంజాబ్ లలో సత్తా చాటిన AAP

జూన్ 19న నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలు వచ్చాయి. గుజరాత్‌లోని విశావదర్‌ను, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విజయం సాధించింది. గుజరాత్‌లోని కడిని బిజెపి కైవసం చేసుకుంది. కేరళలోని నీలంబర్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)‌కు షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ కలిగంజ్‌లో టిఎంసి ఘన విజయం సాధించి తన పట్టును నిలుపుకుంది.

అంగన్‌వాడీ సెంటర్లలో కమీషన్ వసూళ్లు..

అచ్చంపేట ఐసీడీఎస్‌ క్లస్టర్‌లో అచ్చంపేట అమ్రాబాద్, మండలాలలో మొత్తం 195 అంగన్వాడి సెంటర్లు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లలో ఎగ్ బిర్యానీ, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కూడా టీచర్ల నుండి డబ్బులు వసూలు చేసి కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం. కావున పై అధికారి సూచనతోనే ప్రతి అంగన్వాడీ టీచర్ నుండి రూ. 1200, ప్రతి ఆయా నుండి రూ. 300 చొప్పున దాదాపు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు.

తగ్గకుంటే తాట తీస్తాం.. వైసీపీకి మాస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. “వైకాపా నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కొనసాగిస్తున్నారు. బెదిరింపులు, హింసతో ప్రజల్లో భయం సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము భయపడేది లేదు. ప్రజలకు భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం. చట్టబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైతే కఠినంగా స్పందిస్తాం. ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరిస్తున్నాం,” అని పవన్ స్పష్టం చేశారు.

జగన్.. మూడు ముక్కలాటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు: సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్‌- 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్గాటించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామని చెప్పారు. అన్నీ చేసేశామని చెప్పట్లేదని.. ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అమలు చేశామని అన్నారు.

శుభ‌మ‌న్ గిల్ ఔట్‌.. 100 దాటిన ఆధిక్యం

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగ‌వ రోజు ఆరంభంలోనే ఇండియాకు జ‌ల‌క్ త‌గిలింది. తొలి సెష‌న్ తొలి ఓవ‌ర్‌లోనే కీల‌క‌మైన కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ వికెట్‌ను కోల్పోయింది. నిన్న‌టి స్కోర్‌కు మ‌రో రెండు ప‌రుగులు జోడించిన గిల్‌.. కార్సే బౌలింగ్‌లో వ్య‌క్తిగ‌తంగా 8 ప‌రుగులు వ‌ద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో రాహుల్‌, పంత్ ఉన్నారు. ఇండియా ఆధిక్యం వంద ర‌న్స్ దాటింది.

చర్చిలో మారణహోమం..22 మంది మృతి!

సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆదివారం నాడు ఒక చర్చిలో జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర భీభత్సాన్ని సృష్టించింది. డ్వెయిలా శివారులోని మార్ ఎలియాస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా సంభవించిన ఈ పేలుడులో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ISIL (ISIS) ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక వ్యక్తి పాల్పడ్డాడని సిరియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON