loader

మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు: గుంటూరు ఎస్పీ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత జగన్ కార్ కింద పడి సింగయ్య చనిపోయినట్లు గుర్తించాము. దాంతో కేసులోని సెక్షన్లు మార్చి.. జగన్ తో పాటు డ్రైవర్ రమణారెడ్డి […]

మావోయిస్టులను లేకుండా చేస్తాం- అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. నక్సలిజానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటాన్ని ప్రకటించారు. మార్చి 31, 2026 నాటికి దేశం నుండి నక్సలైట్లను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని, వర్షాకాలం సీజన్‌లోనూ నక్సల్స్‌ను విశ్రాంతి తీసుకోనీయమని, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఆ సీజన్‌లోనూ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. నక్సల్స్‌తో చర్చల ప్రసక్తే లేదని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు.

స్టాలిన్‌పై పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులోని మదురైలో జరిగిన ‘మురుగన్ మానాడు’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గంభీరంగా స్పందించారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానాడును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం తగదు. మా మతాన్ని మీరెవరు ప్రశ్నించేది? అంటూ డీఎంకే నేతలపై కౌంటర్ వేశారు. హిందువు హిందువుగా ఉండకూడదా? ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారా? అని ధ్వజమెత్తారు.

రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ తమ పాలనకు ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక సభను నిర్వహించనుంది. “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో ఈ సభ రేపు సాయంత్రం 4 గంటలకు అమరావతి వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షతో పాటు, గడచిన ఏడాది కాలంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలపై చర్చ జరగనుంది.

వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు..!

వైఎస్సార్‌సీపీ ఏపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.

మధురై చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. మధురైలోని మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు వచ్చి వేచిఉన్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు.

విశాఖ లో సరికొత్త రికార్డు : లోకేష్

ప్రపంచ రికార్డును బ్రేక్ చేసి ఎపి సరికొత్త చరిత్ర సృష్టించిందని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ లో యోగాంధ్ర నిర్వహణపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ట్వీట్ చేశారని అన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల పోస్టుపై లోకేష్ స్పందించారు. యోగాంధ్రలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు. 3 లక్షల మందితో యోగాంధ్ర నిర్వహించి రికార్డు సృష్టించారంటూ కొనియాడారని చెప్పారు.

విజయ్ దేవరకొండపై.. అట్రాసిటీ కేసు నమోదు

రెట్రో మూవీ ఈవెంట్లో భారత్ పాక్ మధ్య జరుగుతున్న వార్ ఎలా ఉందంటే దాదాపు 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకున్నట్టు కొట్టుకోవడం ఏంటి అని గిరిజనులను తక్కువ చేసి మాట్లాడడం ఏంటి అని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతేకాదు తాజాగా విజయ్ దేవరకొండపై హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ అప్పుడే గిరిజనులకు క్షమాపణలు చెప్పారు.

హెచ్‌ఐవీ నివారణకు టీకా

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్‌ఐవీ వైరస్‌పై చిరకాల పోరాటం ఫలించింది. దశాబ్దాలుగా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఒక మైలురాయిగా నిలుస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చే హెచ్‌ఐవీ టీకాను అమెరికా ఆమోదించింది. కనీసం 35 కేజీల బరువున్న పెద్దలు, కౌమార దశలో ఉన్న వారికి ప్రెప్‌ ఇంజక్షన్‌గా ఉపయోగించడానికి ఎఫ్‌డీఏ అనుమతిని ఇచ్చింది.

అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటుంది- ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోని అమెరికా ఎట్టకేలకు యుద్ధరంగంలోకి దిగింది. అమెరికా సైనిక జోక్యం చేసుకోవద్దని ఇరాన్ మొదట్నుంచీ చెబుతోంది. కానీ ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇస్ఫహాన్, నటాంజ్, ఫోర్డో అణు స్థావరాలపై అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో దాడులు చేసింది ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీ అమెరికా దాడులను తీవ్రంగా ఖండించారు. తమ అణస్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON