loader

ఏపీ నాయకుల పనితీరు భేష్.. ప్రధాని ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారుగా అంటూ ప్రభుత్వ పెద్దలను అభినందించారు. జూన్ 21న యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 లక్షల మందికి పైగా జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్‌ ఫలితాల(AP EdCET Results 2025)ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 99.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.ఈ పరిక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 17, 795 మంది పరీక్ష రాయగా ఇందులో 14,527మంది ఉత్తీర్ణత సాధించారు.  ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx లో ఉంచారు.

కావ్య మారన్ తండ్రికి నోటీసులు పంపిన ఆమె బాబాయ్..

సన్ టీవీ గ్రూప్‌కు సంబంధించిన వాటాల విషయంలో కళానిధి మారన్‌కు ఆయన సోదరుడు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కళానిధి మారన్, అతడి భార్య కావేరి కళానిధి, మరో ఆరుగురికి దయానిధి మారన్ లీగల్ నోటీసు పంపించారు. కళానిధి మారన్ 2003 నుంచి సన్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సన్ గ్రూప్, దాని సంబంధిత కంపెనీలలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలని […]

సూర్యనమస్కారాల్లో గిన్నిస్ రికార్డు – గిరిజన విద్యార్థుల ఘనత

ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ రోజు మన గిరిజన విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దాదాపు 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ఇదొక వరల్డ్ రికార్డ్. దీనిని శనివారం ప్రకటిస్తారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డ్ సృష్టించేలా 25 వేల మంది అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 […]

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డబ్బులు

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకునే డబ్బు ఏడాదిలో భారీగా పెరిగిపోయింది. 2024లో మూడింతలు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు రూ. 37,600 కోట్లకు చేరింది. 2021 తర్వాత అత్యధికం అని రికార్డులు చెబుతున్నాయి. ఆ సంవత్సరం భారతీయుల డబ్బు సుమారు రూ. 30,500 కోట్లు స్విస్ బ్యాంకుల వద్ద ఉంది. అయితే ఆ తర్వాత ఒక్క సారిగా భారతీయులు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు. 2023లో 70 శాతం తగ్గిపోయింది. […]

తెలంగాణ రైతులకు మరో 905.89 కోట్లు విడుదల

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతుంది. రైతు భరోసా కింద రూ. 9 వేల కోట్లను 9 రోజుల్లో రైతుల ఖాతాలలో జమ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే నేడు రైతు భరోసా కింద మరో 905.89 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం 5 రోజుల లోనే 7310.59 కోట్లు విడుదల చేసామని…ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు […]

సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ.. రూ.10లక్షల ఆర్థికసాయం

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ తొక్కిసలాటలో ప్రమాదానికి గురై వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ నేతలు కార్యకర్త సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు […]

విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ శనివారం విశాఖపట్నంలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.

అతిపెద్ద డేటా లీక్.. హ్యాకర్ల చేతిలో 16 బిలియన్ల మంది డిజిటల్ లాగిన్ వివరాలు

తాజాగా గూగుల్, యాపిల్ అకౌంట్ల బిలియన్ల కొద్దీ లాగిన్ పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయని టెక్ రిసెర్చ్ రిపోర్ట్స్ చెబుతున్నారు. ఇది టెక్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌లలో ఒకటిగా నిపుణులు భావిస్తున్నారు. దీని ఇంపాక్ట్‌ చాలా తీవ్రంగా ఉంటుంది. మనం రోజురోజుకూ డిజిటల్‌ వరల్డ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీంతో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కీలకమైన అంశంగా మారింది. అయితే అప్పుడప్పుడు జరిగే డేటా లీక్‌లు, హ్యాకింగ్ దాడులు మన సేఫ్టీకి పెద్ద ముప్పును కలిగిస్తున్నాయి.

తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టాస్ ఓ డిన భార‌త్ ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నుంది. పిచ్ తో కూడిన ఈ పిచ్ బౌల‌ర్ల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. గ‌త చివ‌రి ఆరు మ్యాచ్ ల్లో టాస్ గెలిచిన జ‌ట్లు బౌలింగ్ ఎంచుకున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో శుభారంభం చేయాల‌ని భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ తోనే 2025-27 ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ సైకిల్ లోని తొలి టెస్టుని ఆడ‌బోతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON