loader

బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదం మళ్లీ మొదలైంది. ఏపీ సర్కారు ప్రతిపాదిత బనకచర్ల నీటి ప్రాజెక్టు ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ క్రమంలోనే బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

విద్యార్థి వీసాల జారీ ప్రారంభించిన అమెరికా

అమెరికా విదేశీ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను ప్రారంభించింది. కాగా చిన్న మెలిక పెడుతూ విదేశాంగ శాఖ బుధవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీయులు తమ షోషల్ మీడియా ప్రొఫైల్స్ ను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. మే నెల చివరిలో విదేశీ విద్యార్థులకు వీసాలు జారీ చేయడాన్ని విదేశాంగ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్తగా సోషల్ మీడియా మార్గదర్శకత్వాన్ని తీసుకువచ్చింది. మళ్లీ ఈ నెలలో వీసాల కోసం దరఖాస్తులను తీసుకోవడం ప్రారంభించింది.

త్వరలో ఆర్‌టిసి బస్సుల్లో వైఫై సదుపాయం..?

తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌టిసి ప్రయాణీకులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్‌టిసి బస్సుల్లో వైఫై సేవలు అందించేందుకు ఓ ప్రైవేటు సంస్థ రవాణా శాఖకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులు ఈ విషయంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినుట్ల సమాచారం. ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా అప్‌లోడెడ్ కంటెంట్‌ను వై-ఫై ద్వారా మొబైళ్లలో చూసే అవకాశాన్ని కల్పిస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. తద్వారా ముందే ఎంపిక చేసిన సినిమాలు, పాటల జాబితా మాత్రమే చూడటానికి వీలుంటుంది.

విశాఖలోని పాఠశాలలకు రెండు రోజులు సెలవులు

విశాఖపట్నం జిల్లా అన్ని యాజమాన్య పాఠశాలలకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీలలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 20, 21లలో పాఠశాలలో ఉదయం సమయాలలో యోగా కార్యకలాపాలు విధిగా నిర్వహించాలన్నారు. అంటే విద్యార్థులు యోగా చేసి వెళ్తే చాలు. సంబంధిత ఫోటోలను లీప్ యాప్ నందు అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేశారు.

అనవసరంగా గొడవలు వద్దు.. ఏపీ సీఎం

బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్లు ఎలా కేటాయిస్తే అలా అని..వారి నిర్ణయం మేరకు నడుచుకుందామని చెప్పారు. ఈ విషయంపై అనవసరంగా గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని రెండు రాష్ట్రాల నాయకులకు హితవు పలికారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం పేర్కొన్నారు.

కొన్ని పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు- కర్ణాటక

కర్ణాటక కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొన్ని పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించింది. ముస్లింలకు ప్రత్యేక కోటా మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు, మంత్రులు సమర్థిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే హౌసింగ్ పథకాలకు ఈ 15 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

ఇందిరా మహిళా శక్తి పథకం…వనిత టీ స్టాల్

తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రంలో మహిళా సాధికారత ధ్యేయంగా ‘ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పోచన్నపేట గ్రామానికి చెందిన రేణుక… రచన మహిళా సమైక్య సంఘం ద్వారా రెండు లక్షల రుణం పొంది వనిత టీ స్టాల్‌ని ఏర్పాటు చేసుకోగా… కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం ప్రారంభించారు.

బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పాం: ఉత్తమ్

కేంద్ర మంత్రికి బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని వివరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై రాష్ట్ర ప్రజల్లో, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని, తమ ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారని ఉత్తమ్ కుమార్ అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరామని చెప్పారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా?: జగన్

వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా?, ఎందుకు ఇన్ని ఆంక్షలు? అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మొన్నటి పొదిలి పర్యటనలోనూ తనకు ఇబ్బందులు సృష్టించారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా?, రైతులను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్‌ను చేయడంలో చంద్రబాబుకు మించిన గొప్ప నాయకుడు ఎవరూ లేరని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ పది మండలాల రైతులకు రైతు భరోసా రద్దు..

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న వేళ, రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల రైతులకు ఈ పథకాన్ని రద్దు చేసింది. ఆకుకూరలు, కూరగాయలు పండించేవారికీ భరోసా నిధులు రద్దు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం ఉండటంతో ఆకుకూరలు సాగు చేస్తున్నామని, తమకు కూడా రైతు భరోసా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం రైతులకు మద్దతు తెలుపుతున్నాయి

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON