రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశం.. కాజోల్ షాకింగ్ కామెంట్స్
నేను షూటింగ్ చేసిన ప్రదేశాల్లో చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయి. భయంతో రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు. తిరిగి ఎప్పుడూ అక్కడికి రాకూడదని అనుకునేదాన్ని. హైదరాబాద్ లోని రామోజీరావు స్టూడియోని ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది వరల్డ్ లోనే అత్యంత భయంకరమైన ప్రదేశమని బాలీవుడ్ నటి కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల షూటింగ్ జరిగే చోటును ఆమె అలా ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.