loader

కుప్పం బాధిత మహిళకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పిన సీఎం.. ఆర్థిక సాయం

కుప్పం ఘటన బాధిత మహిళకు సీఎం చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి పరామర్శించారు. శిరీషా.. ప్రభుత్వం నీతో ఉంది నువ్వు భయపడవద్దు. ప్రభుత్వం నిన్ను అన్ని విధాలా ఆదుకుంటుంది. నీకు పూర్తిగా అండగా ఉంటాము” అని ముఖ్యమంత్రి శిరీషకు భరోసా ఇచ్చారు శిరీషకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే మూగ్గురు పిల్లల చదువుకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.

యూట్యూబ్‌కే హార్రర్ పుట్టించిన ప్రభాస్..

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ సోమవారం విడుదలైంది. గత కొన్నేళ్లుగా అప్డేట్స్ లేక ఆశాభంగానికి గురైన అభిమానులకు టీజర్ కిక్కిస్తోంది. వింటేజ్ లుక్‌లో ప్రభాస్ ఎంట్రీ, చిలిపితనంతో ఆకట్టుకున్నాడు. టీజర్ అలా వచ్చిందో లేదో యూట్యూబ్ షేక్ అయిపోయింది. 24 గంటల్లోనే ఏకంగా 59 మిలియన్ వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌ అవుతూ నంబర్ వన్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది.

రాజధాని ముఖద్వారం అక్కడే..

అమరావతి ముఖద్వారంగా మూలపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మూలపాడు ప్రాంతంలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ఇప్పటికే ప్రణాళికలు రచించారు. తాజాగా అమరావతి ప్రధాన ప్రవేశద్వారంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు ప్రాంతం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో దీనినే ప్రధాన ప్రవేశద్వారంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

తిరుపతి విమానాశ్రయానికి పేరు మార్పు..? కేంద్రానికి టీటీడీ సిఫార్సు..

ిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్రయం పేరు మారబోతుందా? అంటే నిజమనిపిస్తుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పేరు సిఫార్సు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపింది. ఇక నుంచి రేణిగుంటను శ్రీ వేంక‌టేశ్వర అంత‌ర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంపై టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు చర్చించి తీర్మానం చేసింది. కేంద్ర పై ఒత్తిడికి ప్రయత్నిస్తోంది. తిరుమ‌ల‌కు ఐకానిక్‌గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర విమాన‌యాన శాఖ‌కు టీటీడీ సిఫార్సు చేసింది.

విమాన ప్రమాద ఘటన..బాల్కనీ నుంచి దూకేశారు..

జూన్ 12వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. బిజె మెడికల్ కాలేజీ భవనాన్ని విమానం ఢీకొన్న వెంటనే భారీగా శబ్ధం వచ్చింది. దీంతో భయపడిపోయిన విద్యార్థులు మూడో అంతస్థు బాల్కనీకి బెడ్‌షీట్లను కట్టి.. తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు కిందకు దూకేశారు. వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

రేపటిలోగా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అప్పగించాలి.. కెటిఆర్‌కు ఎసిబి ఆర్డర్స్

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కెటిఆర్ సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ లను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. నిన్న ఫార్ములా ఈ కేసులో ఎసిబి విచారణకు కెటిఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణ అనంతరం కెటిఆర్ వాడిన సెల్‌ఫోన్‌, మ్యాక్‌బుక్‌, ట్యాబ్‌లో కీలక సమాచారం ఉందని ఎసిబి అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచే కెటిఆర్‌, అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం మరోకీలక నిర్ణయం…

రాష్ట్రంలో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా… రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని, అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండి… 4 నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని, 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఉప్పల్ భారత్ పెట్రోల్ పంపులో ఘరానా మోసం

వాహనదారులను పెట్రోల్ పంపుల యజమానులు మోసాలకు పాల్పడుతుండడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం పరిదిలో నల్ల చెరువుకట్ట భారత్ పెట్రోల్ పంపులో మీటర్ రిసెట్ చేయకపోవడంతో పాటు ఎలక్ట్రానిక్ చిప్‌లు పెట్టి మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ బాటిల్ లో నింపించుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకు యాజమానిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

జాక్‌పాట్ కొట్టిన భారత్.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో గయానా తరహా చమురు నిక్షేపాలను ఉన్నాయని భారత్ కనుగొంది. సుమారు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని, ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. ఒక్కో బావి తవ్వడానికి దాదాపు రూ.850 కోట్లు ఖర్చవుతుందని దానికోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారన్నారు భారత పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.

బనకచర్లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: నిమ్మల

నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోతున్న ఎపికి.. నీళ్లు ఉపయోగించుకునే హక్కుఉంది అని చెప్పారు. గోదావరి నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయని, ఎగువ నీటి అవసరాలు తీరిన తర్వాతే బనకచర్లకు నీళ్లు వృథాగా పోతున్నాయని ఆ నీళ్లనే బనకచర్లకు వాడుకుంటాం అని తెలియజేశారు. రాజకీయ లబ్ధి కోసమే బనకచర్లపై వైసిపి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON