టేకాఫ్ నుంచి బిల్డింగ్‌పై కూలే వరకు..32 సెకన్లలోనే
విమానం టేకాఫ్ అయి గాల్లోకి ఎగుతున్న క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పూర్తిగా పైకి వెళ్లకుండా.. కొద్ది సెకన్లలోనే కిందికి దిగుతూ.. కాలేజ్ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. దట్టమైన పొగ కమ్ముకుంది. అలా చూస్తుండగానే.. కేవలం 32 సెకన్లలోనే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం పూర్తిగా భస్మం అయిపోయింది.