అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణంరాజుపై తుళ్లూరులో కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు.. విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.