loader

లోకేష్ సంచలన ట్వీట్: జగన్ పై తీవ్ర విమర్శలు

కొమ్మినేని డిబేట్‌లో జరిగిన వ్యాఖ్యలకు తమ పార్టీకి, ఛానెల్‌కు సంబంధం లేదని జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ట్వీట్ చేశారు. నారా లోకేష్ ఓ వీడియోతో గట్టి కౌంటర్ ఇచ్చారు.అందులో వైఎస్సార్సీపీ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోను ఉంచారు. జగన్ గారు మీ హిపోక్రసీని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది… నాది కాలేజ్ లైఫ్ నీది జైలు లైఫ్- అర్థమైందా రాజా…? జగన్‌కు కౌంటర్‌గా ట్వీట్ చేసిన లోకేష్‌..

వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..

వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో అమరావతి వేదికగా వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆ శాఖ అధికారులతో చర్చించిన చంద్రబాబు.. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై.. 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని.. అందుకు అనుగుణంగానే.. మూడు పంటల విధానం తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి […]

కాశీలో 21 మంది నకిలీ పూజారులు అరెస్ట్‌..

విశ్వనాథుడిని దర్శించుకోవడానికి వారణాసికి వెళ్తున్నవారు జాగ్రత్తగా ఉండండి. నకిలీ పూజారులు, పండితుల ముఠా ఉంది. వారు దర్శనం, సరైన పూజలు అందిస్తామని డబ్బు వసూలు చేస్తారు. ఈ ముఠా పై ఫిర్యాదులు నిరంతరం అందుతున్నాయి, కానీ వారణాసి పోలీసులు పట్టించుకోలేదు. ఒక అధికారి బంధువుతో డబ్బు వసూలు చేసి, దురుసుగా ప్రవర్తించినప్పుడు, వారణాసి పోలీసులపై ఒత్తిడి వచ్చింది. దీంతో పోలీసులు రైడ్‌ చేసి మంగళవారం కాశీ విశ్వనాథ ఆలయం చుట్టూ ఉన్న 21 మంది నకిలీ పూజారులను […]

అడవిలో 7 కిలోమీటర్లు బైక్ పై ఆదిలాబాద్ ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అడవిలో ఓ గ్రామానికి వెళుతూ ఏడు కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారు. బీంపూర్ మండలంలోని మారుమూల గ్రామాలైన గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్ పూర్ గ్రామాలను సందర్శించి ప్రజలతో పోలీసు మీకోసం కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని గ్రామ పేరును కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు. అదేవిధంగా గ్రామాలలో మాదకద్రవ్యాలకు దూరం ఉండేలా, ఎలాంటి గంజాయిని పండించకూడదని, ఎవరూ సేవించకూడదని […]

ఎపిలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: రోజా

ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు రక్షణ లేదని మాజీ మంత్రి రోజా తెలిపారు. అధికారంలో ఉన్నవాళ్లే అరాచకాలు చేస్తున్నా హోంమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతుంటే పవన్‌ స్పందించడం లేదన్నారు. హామీలు వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రెడ్‌బుక్‌ పేరిట అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలపై దాడులు జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టించుకోవలేదన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసు రావుపై తప్పుడు కేసు అరెస్ట్ చేశారని రోజా ధ్వజమెత్తారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బంపర్ న్యూస్..

గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించనుంది. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సంబంధిత అధికారులతో చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. రెండు రోజులలోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది.

పాఠశాలలో విద్యార్థి విచక్షణారహిత కాల్పులు.. 10 మంది పిల్లలు మృతి!

ఆస్ట్రియాలోని అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రాజ్ నగరంలోని ఒక పాఠశాలలో జరిగిన భీకర కాల్పుల్లో 10 మంది విద్యార్థులు మరణించారు.  స్థానిక మీడియా కథనం ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుడు పాఠశాలలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు ముగియగానే, చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకున్నాడు. దాడి చేసిన విద్యార్థి కూడా అక్కడికక్కడే మరణించాడు.

గ్రూప్2 నియామకాల తర్వాతే.. గ్రూప్3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్!

తెలంగాణలో గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌ను వాయిదా వేస్తూ TGPSC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలని TGPSC నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. పోస్టుల బ్యాక్ లాగ్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కొత్త షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

పూర్తిగా డౌన్ అయిన ఓపెన్ ఎఐ చాట్‌జిపిటి.!

ఓపెన్ ఎఐ చాట్ బాట్ చాట్‌జిపిటి పూర్తిగా డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని డౌన్ డిక్టేటర్ సాక్షిగా యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ క్రౌడ్ సోర్స్ అవుట్టేజ్ మోనిటర్ సర్వీస్ downdetector ఈ విషయాన్ని వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత చాట్‌జిపిటి డౌన్ అయినట్లు గుర్తించిన యూజర్లు ఈ సైట్ నుంచి రిపోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి మొదలైన సమస్య మధ్యాహ్నం 2 గంటల తర్వాత తార స్థాయికి చేరుకున్నట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు.

ఐదేళ్లలోపు చిన్నారుల కోసం బాల భరోసా

ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం మరో కొత్త ప్రథకాన్ని తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ‘బాల భరోసా’ పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోనుంది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఈ పథకం వివరాలను వెల్లడించారు. పథకం కింద ఐదేళ్ల లోపు పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని ఆమె తెలిపారు. అంతేకాకుండా అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON