loader

Google Photos లో కొత్త AI వీడియో ఎడిటింగ్ టూల్స్

గూగుల్ ఫొటోస్ లో గూగుల్ కొత్తగా AI-Powered ఎడిటింగ్ టూల్స్ జత చేసింది.  కొత్త ఫీచర్ ను యూజర్ల కోసం జత చేసింది. రీ ఇమాజిన్, ఆటో ఫ్రేమ్ మరియు AI ఎన్ హెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు గూగుల్ ఫొటోస్ లో కొత్తగా Ultra HDR ఫీచర్ ను కూడా జత చేసింది. ఈ ఫీచర్ పాత ఫోటోలను మంచి బ్రైట్నెస్ మరియు కలర్ రేంజ్ తో గొప్ప అప్ స్కేల్ […]

రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో నాలుగు రోజుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. జూన్ నెలలో రెండు వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో గత వారం రోజుల నుండి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ […]

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతుంది. అయితే, సోనియా గాంధీని సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.

జనసేన నేతల దందా గురించి వర్మ సెటైర్లు..

పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్న నేపథ్యంలో వర్మ వెల్లడించిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. మల్లి వారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించిన వర్మ రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోందని పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలని అన్నారు. రమణక్కపేటలో ఇసుక అక్రమ రవాణాకు శంకుస్థాపన చేశారని వర్మ కామెంట్ చేశారు. వర్మ ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఆది, సోమవారం చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్‌లో రేపటి నుంచి రెండు రోజులపాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేశారు. మృగశిరకార్తెను పురస్కరించుకొని బత్తిన వంశస్తులు ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ ప్రసాదం తీసుకుంటే ఆస్తమా కంట్రోల్ అవుతుందనే ప్రచారం చాలా కాలంగా ఉంది.

మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ మంత్రివర్గం విస్తరణకు ముహుర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఆదివారం రోజున తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కేబినెట్‌లో మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉండగా… ప్రస్తుతానికి ముగ్గురు లేదా నలుగురికి చోటు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న విద్య, హోం, మైనారిటీ సంక్షేమం వంటి కొన్ని శాఖలను వదులుకోవచ్చు.

అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకోన్…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ను తీసుకున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌కి దీపికను తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో దీపిక అయితే సూపర్ ఉమెన్‌గా కనిపించబోతోన్నారనిపిస్తోంది. దీపిక హీరోయిన్ అంటూ వదిలిన అనౌన్మెంట్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

టీడీపీకి ఎదురు దెబ్బ.. కడప జిల్లాలో సీనియర్ నేత రాజీనామా..

ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.. మహానాడు జరిగిన పది రోజులకే సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. రాజంపేట టీడీపీలో గ్రూప్ వార్ నడుస్తుండటం, పాలకొండ్రాయుడు మరణంపై చంద్రబాబు స్పందించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో స్టార్ లింక్‌ సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌.. కేంద్రం ఆమోదం!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్‌కు భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం విభాగం లైసెన్స్‌ను జారీచేసింది. భారత్‌లో ఈ రకమైన లైసెన్స్ పొందిన మూడవ కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. స్టార్ లింక్ సంస్థ తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో ఉండే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు చెందిన 6వేల శాటిలైట్లు […]

మంత్రిగారి కోపం.. అధికారి ఇచ్చిన బొకేను విసిరికొట్టిన సవిత..

ఏపీ మంత్రి సవితమ్మకు కోపం వచ్చింది. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.. ఇటీవల పెనుకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా పెనుకొండకు చెందిన ఓ అధికారి ఆమెకు స్వాగతం పలుకుతూ బొకేను అందించారు. అయితే బొకే తీసుకున్న సవిత.. దానిని కోపంతో వెనక్కి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో సవిత తీరును కొంతమంది నెటిజనం తప్పుబడుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON