loader

ఐపీఎల్‌ 2025 విజేత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం నుంచి ఆడుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి ట్రోఫీ దక్కింది. ఉత్కంఠ రేకెత్తించిన ట్రోఫీ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ పోరాడినా కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఆఖరి యుద్ధంలో హోరాహోరీగా తలపడినా పంజాబ్‌పై బెంగళూరు పైచేయి సాధించి ఐపీఎల్‌ 2025 ట్రోఫీని కైవసం చేసుకుంది. 18 ఏళ్లుగా తీరని కలగా ఉన్న ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.

చివర్లో తడబడిన బెంగళూరు.. పంజాబ్ కింగ్స్ టార్గెట్

ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కోహ్లీ తప్ప మరెవరూ 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. అయితే, జితేష్ వేగంగా బ్యాటింగ్ చేసి 10 బంతుల్లో 240 స్ట్రైక్ రేట్‌తో 24 పరుగులు చేశాడు.

నీట్ యూజీ ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల

జాతీయస్థాయి మెడికల్ ప్రవేశపరీక్ష నీట్ యూజీ-2025 పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు, ఒక్కో ప్రశ్నకు ₹200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు జూన్ 5న రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో అభ్యంతరాలు నమోదు చేయవచ్చు.

అతడు నా గన్ మెన్ కాదు…వైసీపీ ఎంపీ గురుమూర్తి

వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. డ్రగ్స్ దందాలో దొరికిన కానిస్టేబుల్ ను తన గన్ మెన్ అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఆ కానిస్టేబుల్ ఇప్పుడు త‌న గ‌న్‌మెన్ కాద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తూ తప్పు చేస్తూ దొరికిపోతే తనకు ఆపాదించడం కరెక్ట్ కాదని అన్నారు. టీడీపీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు వేయడం, బురదజల్లడం అలవాటుగా మారిందని విమర్శించారు.

ఈ వ్యక్తి బ్రాండ్‌నే కొట్టేశాడు- వీడు మామూలోడు కాదు

ఎవరైనా డబ్బులు కొట్టేస్తారు.. బంగారం కొట్టేస్తారు.. కానీ బ్రాండ్ ను కొట్టేయడం సాధ్యమా ?. సాధ్యమేనని నిరూపించాడు యశ్వంత్ అనే వ్యక్తి. నకిలీ పత్రాల ద్వారా 1979 నుండి మద్రాస్ ఫిల్టర్ కాఫీ వ్యాపారంలో ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులను, కోర్టు లను బురిడీ కొట్టించి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తెచ్చుకొని ప్రజల్ని మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఫ్రాంచైజీలు అమ్ముకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు గడించి సాటి వ్యాపారస్తులను ముంచేశాడు.

అంబరాన్ని అంటిన ఐపీఎల్ ముగింపు వేడుకలు

భారతదేశపు దిగ్గజ సంగీతకారుడు శంకర్ మహదేవన్ దేశభక్తి గీతాలు పాడుతూ, భారత సైన్యానికి నీరాజనం పలికారు. నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శంకర్ మహదేవన్ కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు.  ఆయన భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ పాడినప్పుడు, మైదానంలో ఉన్న వేలాది మంది ఆయనతో పాటు హమ్ చేశారు శంకర్ మహదేవన్, అతని బృందాన్ని హర్ష భోగ్లే స్వాగతించారు. దీంతో ముగింపు వేడుక ప్రారంభమైంది.

ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి “బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ నాయకులపై కొంచెం ఒత్తిడి తెచ్చినా, వారు భయపడి పారిపోతారు. డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుండి ఫోన్ చేసి.. నరేందర్.. లొంగిపోండి అని అన్నారు. ఇక్కడ, నరేంద్ర మోడీ ‘ఎస్ సార్’ అని యుద్ధం విరమించుకున్నారు” అని రాహుల్ అన్నారు.

కెసిఆర్ కు నోటీసులపై కవిత సీరియస్.. రేపు మహాధర్నా

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా కెసిఆర్ కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ నోటీసులు వ్యతిరేకిస్తూ.. బుధవారం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి  రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మహాధర్నా చేపట్టనున్నట్లు  నిర్వహించనున్నట్లు కవిత తెలిపింది.

4026కు చేరుకున్న కరోనా కేసులు..

మంగళవారం నాటికి దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటగా.. గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగే కేరళ ఎక్కువ కేసులతో అగ్ర స్థానంలో నిలిచింది. అయితే ఢిల్లీలోనూ గణనీయంగా కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజీవ్ బహల్ తెలిపారు. కాకపోతే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుని కేసు రీ-ఓపెన్‌‌..? క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో సంచలనం సృష్టించిన తుని కేసును రీ ఓపెన్ చేయనున్నట్లు సోమవారం అధికార వర్గాలు తెలిపాయి.. కేసు తెరపైకొచ్చిన 24 గంటల్లోనే రీఓపెన్‌ ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేసును రీ-ఓపెన్‌ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. రైల్వేకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే యోచనను విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దన్న ప్రభుత్వం… కేసును తిరగదోడే ఉద్దేశం లేదంటూ ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON