loader

రాష్ట్ర అవతరణ రోజు కండువా మార్చిన కవిత..?

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కవిత చేసిన పనికి చాలామంది షాక్ అయిపోతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ముందే జాగృతి పార్టీ ఆఫీస్ ని కొత్తగా ఓపెన్ చేసిన కవిత తాజాగా రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొంది. ఇందులో కవిత వేసుకున్న కండువా కూడా మార్చుకుంది. జాగృతి అని ఉన్న కండువాని మెడలో వేసుకుంది.అలాగే  కవిత జై తెలంగాణ.. జై జాగృతి.. జై కేసీఆర్..అని చెప్పింది కానీ జై బీఆర్ఎస్ అని ఒక్కసారి కూడా తన నోటి […]

రేష‌న్‌ దుకాణం తెరవక ముందే బియ్యం అక్రమ రవాణా

ఏపీలో కూటమి ప్రభుత్వం పాత పద్దతిలోనూ జూన్‌ ఒకటి నుంచి రేషన్‌ డిపోల వద్దనే రేషన్‌ ఇచ్చేలా మార్పులు చేసింది. ఈ ప్రక్రియను జూన్‌ ఒకటి నుంచి ప్రారంభించింది.. సరిగ్గా అదే రోజు కోనసీమలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం బండార్లంకలో ఓ రేషన్‌ డిపో నుంచి 40 బస్తాలు ట్రాక్టరులో వేరే ప్రాంతానికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు పట్టుకున్నారు.

2025 ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్‌ విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. సెప్టెంబర్ 30న మొదలయ్యే మహిళల ప్రపంచ కప్, నవంబర్ 2 వరకూ సాగుతుంది. ఇండియాతో పాటు శ్రీలంక సంయుక్తంగా ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. బెంగళూరు, గౌహతి , ఇండోర్‌ , విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతాయి. అలాగే పాకిస్తాన్ ఆడే మ్యాచులకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ప్రజల వద్దకే అధికారులు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ వ్యవస్థలో మరో ముందడుగుకు శ్రీకారం చుట్టింది. ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 3 నుంచి 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను అక్కడే పరిష్కరించేదిశగా అడుగులు వేయనుంది. రెవెన్యూ సదస్సులపై సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారులతో సమీక్షించారు.

రూపాయికి ఎకరం- వైఎస్ జగన్‌కు నారా లోకేష్ చాలెంజ్

నారా లోకేష్ రాజీనామా చాలెంజ్ విసిరారు. పోటీగా జగన్ రాజీనామా చేయాల్సింది లేదని క్షమాపణ చెబితే చాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉర్సా కంపెనీలు రూపాయికి ఎకరం భూములు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని మార్కెట్ రేటుకే ఇచ్చామని నారా లోకేష్ అంటున్నారు. ఓ సారి క్లారిటీ ఇచ్చినా జగన్ ఆపకపోవడంతో ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు.

హార్థిక్ పాండ్యాకు భారీ జరిమానా విధించిన బిసిసిఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టును విజయవంతంగా ముందు నడిపించాడు హార్థిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మొయింటేన్ చేసిన కారణంగా అతనికి భారీ జరిమానా విధించింది. ఈ సీజన్‌లో ఇది మూడోసారి కావడంతో హార్థిక్‌కు రూ.30 లక్షలు జరిమానా విధించింది.జట్టులోని అందరి ఆటగాళ్లకీ మ్యాచ్ ఫీజులో 50 శాతం లేదా రూ.12 లక్షలు జరిమానా పడింది. అయితే ఈ సీజన్‌లో రూల్స్ మారడంతో హార్థిక్ […]

మెగా డీఎస్సీ పరీక్ష కేంద్రాల కేటాయింపులో గిజిబిజీ..

మెగా డీఎస్సీ అభ్యర్ధులు ఒప్పించలేక తీవ్ర మానసిక వ్యధను అనుభవిస్తున్నారు అందుకు కారణం.. తాజాగా విడులైన మెగా డీఎస్సీ హాల్‌ టికెట్లే.అభ్యర్ధులు 3, 4 పోస్టులకు దరఖాస్తు చేసుకోగా హాల్‌ టికెట్లలో ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో కేటాయించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన చదలవాడ ధనలక్ష్మి అనే అభ్యర్ధికి జూన్‌ 6న టీజీటీ గణితం విజయవాడ,9న స్కూల్‌ అసిస్టెంట్‌ భౌతికశాస్త్రం హైదరాబాద్‌, 12న స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం విజయవాడ 24న ఆంగ్ల భాష నైపుణ్య విజయవాడ […]

కేసీఆర్‌ విజ్ఞప్తిని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్ ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులను విచారించింది. వీరంతా సీఎం సమక్షంలోనే నిర్ణయాలు జరిగాయని తెలపడంతో కేసీఆర్‌కు జూన్‌ 5న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు, జూన్ ఐదో తేదీకి బదులు 11న విచారణకు హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు కమిషన్ విచారణ తేదీని మార్చింది. కేసీఆర్ ఈనెల 11న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ […]

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులకు సన్మానం…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 9 మంది అందెశ్రీ, పాశం యాదగిరి, గద్దర్, గోరేటి వెంకన్న, బండి యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, గూడ అంజయ్య, ఎక్కా యాదగిరి రావు, నలిమెల భాస్కర్ లను సన్మానించారు.పురస్కారాలు అందజేయడమే కాకుండా నగదు ప్రోత్సహంగా వారికి రూ. కోటి చొప్పున సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON