సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ యజమానికి ఇంటికి చేరిన కారు
డ్రైవర్‌లెస్ కారు కల సాక్షాత్కారమైంది. ఓ కారు దానికదే పూర్తి స్థాయిలో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ రోడ్ల మీద పరుగులు పెట్టింది. అమెరికాకు చెందిన టెస్లా మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు రోడ్ల మీద పరుగులు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘టెస్లా మోడల్ వై’ పేరుతో డ్రైవర్‌లెస్ కారును తాయరు చేసింది. ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే హైవేలు, ట్రాఫిక్ సిగ్నళ్లు దాటుకుంటూ యజమాని ఇంటికి దానికదే డెలివరీ అయింది.