loader

రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు… మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ఆదేశాలు జారి చేశారు. రేషన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో  మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి రేషన్ డీలర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఖచ్చితమైన బరువుతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని చెప్పారు. రేషన్ దుకాణాల్లో ధరల బోర్డులు, స్టాక్ బోర్డులు, పోస్టర్ల ప్రదర్శన సరైన విధంగా ఏర్పాటు చేసుకోవాలని […]

రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

సైనికులకు సెల్యూట్ చేయడానికి బదులుగా, ఎన్ని రాఫెల్‌లను కాల్చివేశారని అడగడం సిగ్గుచేటు అన్నారు. ఇది భారత సైన్యం నైతికతను దెబ్బతీస్తుందన్న కిషన్ రెడ్డి. వారి అజ్ఞానాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. జాతీయ భద్రతను రాజకీయ అపహాస్యం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ నేత కుళ్లు రాజకీయాలు భారతదేశ దౌత్య లాభాలను, జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. మేము చప్పట్లు అడగమని, భారతదేశం విజయాల గురించి ఏడవడం ఆపండి అంటూ కిషన్ రెడ్డి హితబోధ పలికారు.

ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్. . . దిల్లీలో చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని మఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పారిశ్రమలను ప్రోత్సహించి బిజినెస్ ప్రారంభమైతేనే ఆదాయం పెరుగుతుందని అన్నారు. అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వగలమని పేర్కొన్నారు. ఇప్పుడు చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల అవకాశాలు వచ్చిన వాళ్లకు వివరించారు.

తప్పు చేస్తేనే సారీ చెబుతా..కమల్

కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దక్షిణ భారత సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజా వివాదంపై స్పందించిన కమల్ హాసన్.. “నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను. మన దేశం ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాను. కర్ణాటకపై నాకున్న ప్రేమ నిజమైనదే. ఇదే విధంగా ఆంధ్రా, కేరళ పట్ల కూడా. నా జీవన శైలి ఇది. దయచేసి దానిని లాగకండి” అని అన్నారు.

త్రీ గోర్జెస్ డ్యామ్‌ లాంటి అద్భుతం కాళేశ్వరం- కేటీఆర్

ధృడ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సంపదను సృష్టించడంతో పాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిందన్నారు తెలంగాణ ఎందుకు ముఖ్యం? అన్న అంశంపై లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ ప్రధాన […]

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్….

ఖరీఫ్ పంట 2025 కు రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర వాటా 50% సమానమైన వాటాను ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 132 కోట్ల 58 లక్షల నిధులు విడుదలు చేసింది. దీంతో రైతులు సకాలంలో పంట బీమా సౌలభ్యం పొందగలుగుతారు. ఈ పథకం కింద ఖరీఫ్ పంటలకు రైతులు కేవలం 2 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్‌ టైమ్‌ హైదరాబాద్‌లో

రక్త పరీక్ష చేయాలంటే సూదితో గుచ్చి రక్తాన్ని తీసుకుని.. పరీక్షలు చేస్తారు. రిజల్ట్ కూడా త్వరగా రాదు. ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయ్యింది. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐ ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్త్‌ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు […]

హరీష్, ఈటల రహస్యంగా కలుసుకున్నారు…టీపీసీసీ చీఫ్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్‌ దోస్తీకి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే బండి సంజయ్‌ను పదవిలో నుంచి తొలగించింది వాస్తవం కాదా? అని ప్రశ్నల […]

సీఎంని కలిసిన హరి హర వీరమల్లుకు నిర్మాత ఏఎం రత్నం

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో అంత సుముఖంగా లేరన్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన తరువాత పరిణామాలన్నీ మారాయి. అదనపు షోలు, ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనే మాట కూడా ఎత్తడం లేదన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి టైంలో హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

పెన్షనర్లకు భారీ షాక్ ఇక డీఏలు రావు..పే కమిషన్ కూడా వర్తించదు

పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారం, పదవీ విరమణ చేసిన సర్కారీ ఉద్యోగులు ఇకపై డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు లేదా భవిష్యత్తు పే కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కాదు. రాబోయే 8వ పే కమిషన్ ప్రయోజనాలు కూడా దక్కవు. ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రభుత్వం ఇకపై పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించే బాధ్యత తీసుకోదని స్పష్టం చేస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON