loader

సౌదీలో మద్య నిషేధం ఎత్తివేత- 73 ఏళ్ల తర్వాత

కఠినమైన నియమాలు పాటించే సౌదీ అరేబియా లో కూడా కాలానికి తగ్గట్లుగా మారే ప్రయత్నాలు చేస్తోంది. ఏడు దశాబ్దాలుగా ఆ దేశంలో మద్యానికి అనుమతి లేదు. 2026 నాటికి, సౌదీ అరేబియా తమ 73 ఏళ్ల మద్య నిషేధాన్ని  సడలించాలని యోచిస్తోంది, దేశవ్యాప్తంగా సుమారు 600 లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లు, పర్యాటక స్థలాలలో మద్యం అమ్మకాలను అనుమతించనున్నారు. సౌదీలో త్వరలో అనుమతి ఇవ్వనున్న మద్యం అమ్మకాలు కేవలం 20 శాతం కంటే తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న […]

అవును ఆ ఇంటికి వెళ్లాను.. విజయసాయిరెడ్డి

విజయసాయిరెడ్డి అమ్ముడుపోయారంటూ వైసీపీ వీడియోపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానన్న విజయసాయిరెడ్డి.. తనకు కృష్ణగారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. వారందరూ కూడా తన కుమార్తె వివాహానికి వచ్చారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన సమయంలోనే టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

కేటీఆర్‌కు ఫార్ములా ఈ రేసు కేసులో మరోసారి ఏసీబీ నోటీసులు

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 28వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. గతంలో ఓ సారి ఏసీబీ ఈ కేసు అంశంలో ప్రశ్నించింది. అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది కానీ, హఠాత్తుగా ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లోనే తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది.

ఆస్కార్ నటులు ఎక్కువైపోయారు.. బండ్ల ట్వీట్‌

థియేటర్లు మూసివేత వివాదంపై దిల్ రాజు వివరణ ఇచ్చిన వెంటనే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ల నటన చూడలేకపోతున్నాం” అంటూ చేసిన ట్వీట్ దిల్ రాజునే ఉద్దేశించి చేశారని నెటిజన్లు అనుకుంటున్నారు. నీకు దమ్ముంటే ఎవరిని ఉధ్దేశించి అంటున్నావో చెప్పన్నా అని కొందరు బండ్ల గణేష్‌ని నిలదీస్తున్నారు. మరికొందరేమో ‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వచ్చి స్పీచ్ ఇవ్వన్నా అని కోరుతున్నారు.

అందాల పోటీలకు రూ.200 కోట్లు.. చేపపిల్లల పంపిణీకి రూ.100 కోట్లు లేవా?

అందాల పోటీలకు రూ.200 కోట్లు ఉంటాయి. కానీ చేప పిల్లల పంపిణీకి రూ100 కోట్లు లేవా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం ముదిరాజ్‌లను ఉద్ధరించిందేమీ లేదని, ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా చేప పిల్లలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. కెసిఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రూ.120 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల్ని చెరువుల్లో, ప్రాజెక్టులలో పోసిందని గుర్తు చేశారు.

ఆ ఆరుగురు శత్రువుల వల్లే నంబాల ఎన్‌కౌంటర్..

మవోయిస్టులపై కేంద్ర నిర్వహించిన ఆపరేషన్ కాగర్‌పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి పేరు మీద లేఖ విడుదలైంది. వివిధ యూనిట్ల నుండి కొంతమంది  పోలీసు అధికారుల ముందు లొంగిపోయి దేశద్రోహులుగా మారారు. దాదా భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్న CYPC సభ్యులు కూడా వారిలో ఉన్నారు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా అదే సమయంలో దేశద్రోహిగా మారాడు. నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారని మవోయిస్టు కేంద్ర కమిటీ […]

గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో విషాదం చోటు చేసుకుంది. కె.గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వివిధ ప్రాంతాల నుంచి యువకులు వచ్చారు. యువకులు సరదాగా గోదావరి గట్టుకు వెళ్లారు. ఈత సరదాతో గోదావరిలో దిగారు. దాదాపు 11 మంది యువకులు స్నానానికి వెళ్లారు. వెళ్లిన కాసేపటికే 8 మంది కొట్టుకుపోయారు. జిల్లా కలెక్టరుతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. గాలింపు చర్యలు జరుగుతున్న తీరును సీఎం చంద్రబాబుకు కలెక్టర్ […]

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వాయిస్ చాట్

WhatsApp తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక గ్రూప్ చాట్‌లలో టైపింగ్ శ్రమ అక్కర్లేదు. గ్రూప్ వాయిస్ చాట్ అనే కొత్త టూల్‌ను ప్రారంభించింది, మీరు గ్రూప్ చాట్‌లో నేరుగా మీ గొంతుతో మాట్లాడవచ్చు, అది కూడా హ్యాండ్స్-ఫ్రీ, రియల్-టైమ్‌లో. అంటే కాల్ చేయకుండా, నేరుగా గ్రూప్‌లో లైవ్ వాయిస్ చాట్‌ను ప్రారంభించవచ్చు, అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు ఉంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON